చలికాలం మొదలైంది.. సీజనల్ వ్యాధులు కూడా మొదలయ్యాయి.. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.. శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తగానే చాలా మంది యాంటీ బయాటిక్ లను, మందులను, సిరప్ లను వాడుతూ ఉంటారు.. కానీ వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.. అందుకే ఇంట్లో ఉండే వాటితో సులువుగా ఒక డ్రింక్ ను తయారు చేసుకొని తాగితే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించడంతో ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.. ఆ డ్రింక్ గురించి వివరంగా తెలుసుకుందాం..
ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం పుదీనా ఆకులను, అల్లాన్ని, పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి.. అందులో పది పుదీనా ఆకులు వేసి, చిన్న ముక్క అల్లం వెయ్యాలి.. ఆ నీటిని బాగా మరిగించి టీ స్పూన్ పసుపు వేసి మరో 2 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. నీరు గోరు వెచ్చగా అయిన తరువాత వడకట్టి గ్లాస్ లో పోసిన తరువాత అందులో ఒక టీ స్పూన్ తేనె వేసుకొని తాగితే ఎటువంటి అనారోగ్యం సమస్యలు రాకుండా ఉంటాయి..
ఇన్పెక్షన్ ను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇలా నీటిని తయారు చేసి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. ఊపిరితిత్తులు కూడా శుభ్రపడతాయి. అలాగే ఈ పానీయాన్ని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లలకు అర గ్లాస్, పెద్దలు అయితే ఫుల్ గ్లాస్ తాగవచ్చు.. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.. ఇలా చేసుకొని తాగితే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.