Site icon NTV Telugu

Health Tips :రోజూ రాత్రి దీన్ని తీసుకుంటే..శరీరంలో ఉండే కొవ్వు మొత్తం వెన్నలా కరిగిపోతుంది..

Weigh Loss

Weigh Loss

ప్రస్తుతం అందరు టెక్నాలజీతో పాటు పరుగులు పెడుతున్నారు.. ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.. దాంతో అందరికి ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది.. తద్వారా ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది… తిన్న తిండికి కనీసం పావు వంతు కూడా కష్టపడటం లేదు.. దాంతో ఒంట్లో కొవ్వు పేరుకు పోతుంది..అధిక బరువుతో పాటు పొట్ట, తొడలు, పిరుదులు వంటి వివిధ శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మనలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు.. అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.. మారిన జీవనశైలి వంటి వివిధ రకాల కారణాల చేత మనలో చాలా మంది అధిక బరువు బారిన పడుతున్నారు. శరీరంలో కొవ్వు పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి మనలో చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అయితే మీ కోసం అద్భుతమైన చిట్కా ను తీసుకొచ్చాం.. అదేంటో ఒకసారి చూసేయ్యండి..

ఈ పానీయం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ఈ పానీయం కోసం 50 గ్రాముల సోంపును, అర టేబుల్ స్పూన్ పసుపును, 25 గ్రాముల అవిసె గింజలను, 25 గ్రాముల జీలకర్రను, 25 గ్రాముల కరివేపాకు పొడిని, 25 గ్రాముల కరక్కాయ పొడిని, అర టేబుల్ స్పూన్ సైంధవ లవణం, 2 చిటికెల ఇంగువను ఉపయోగించాల్సి ఉంటుంది… ముందుగా కళాయిలో అవిసె గింజలను వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే జీలకర్ర, సోంపును కూడా విడివిడిగా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ పదార్థాలను ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి.

ఈ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు స్పూన్ కలిపి తీసుకోవాలి. దీనిని రాత్రి భోజనం చేసిన ఒక గంట తరువాత తీసుకోవాలి. మరిన్ని అద్భుత ప్రయోజనాల కోసం దీనిని ఉదయం, మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. తీసుకున్న ప్రతిసారి గోరు వెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అలాగే దీనిని వాడినన్ని రోజులు ఎటువంటి జంక్ ఫుడ్ ను తీసుకోకూడదు. చూసారుగా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి..

Exit mobile version