NTV Telugu Site icon

Health Tips : చలికాలంలో బెల్లం టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. రోజూ తాగుతారు…!

Jeggerytea

Jeggerytea

సాధారణంగా చాలా మందికి టీ, కాఫీ అలవాటు ఉంటుంది.. ఇక చలికాలంలో పొద్దున్నే ఒక చుక్క వేడిగా తాగాలని అనుకుంటారు.. చలి కాలంలో రోగాలు త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. దీని కారణంగా త్వరగా బ్యాక్టీరియా ఎటాక్ చేస్తూ ఉంటుంది. అందుకే చలి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. అంతే కాకుండా సూర్యుని వేడి కూడా తక్కువగా ఉంటుంది.. అందుకే భోజనం కూడా త్వరగా చేయాలి.. చాలా మంది వ్యాయామాలు చేయడానికి ఆసక్తి చూపరు. దీని కారణంగా ఫిట్ నెస్ కోల్పోతారు. ఇలాంటి సమయంలో బెల్లం టీ తాగితే.. వెయిట్ లాస్ అవ్వడంతో పాటు కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.. మరి బెల్లం టీ ని ఎలా తాగాలి.. ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చలి కాలంలో క్రమం తప్పకుండా బెల్లం టీ తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు అనేవి తగ్గుతాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి కాబట్టి.. జీర్ణ క్రియ పెరుగుతుంది. దీంతో గ్యాస్, అజీర్తి, మల బద్ధకం వంటి సమస్యల తగ్గుముఖం పడతాయి..

చలి కాలంలో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారు కూడా చలి కాలంలో బరువు తగ్గే ఆహారాలను తీసుకోవాలి.. కొవ్వును కరిగించడంలో బెల్లం టీ బాగా పనిచేస్తుంది..

చలి కాలంలో బెల్లంతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో శరీరంలో బలంగా మారుతుంది..

ఇక చివరగా మహిళలు బెల్లం టీని తాగడం వల్ల శరీరానికి అనేక రకాలైన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో వచ్చే నెలసరి నొప్పులు కూడా బెల్లం టీతో తగ్గించుకోవచ్చు. పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గించడంలో బెల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments