Site icon NTV Telugu

Health Tips : స్వీట్ కార్న్ ను ఇలా తీసుకుంటే.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

Sweet Corn

Sweet Corn

స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు.. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.. వీటితో చేసే ప్రతి వంటను కు కూడా మంచి ఆదరణ ఉంటుంది..స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపం లో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

స్వీట్ కార్న్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్‌, విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లు, మెగ్నిషియం, ఫాస్ఫరస్‌, మాంగనీస్ ఉంటాయి. ఇవన్నీ మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీర విధులు సక్రమం గా నిర్వర్తించేలా చూస్తాయి.. ఇవి జీర్ణ శక్తిని మెరుగు పరుస్తాయి.. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. సుఖ విరేచనం అవుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.. కళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.. అలాగే గుండె కు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది..

కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌ రాకుండా అడ్డుకోవచ్చు. స్వీట్ కార్న్‌లో క్యాలరీ లు, ఫ్యాట్ తక్కువగా ఉంటాయి.. అందుకే కొంతగా తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది.. తెల్ల రక్త కణాలు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. స్వీట్ కార్న్‌లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.. చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఒక్కటి అని కాదు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. తక్కువ ధరకే లభిస్తున్నాయి.. అందుకే వీటిని ఎక్కువగా ఇష్టపడతారు..  ఇన్ని ప్రయోజనాలు ఉన్న స్వీట్ కార్న్ ను తినడం మర్చి పోకండి..

Exit mobile version