NTV Telugu Site icon

Health Tips : రాత్రి 9 తర్వాత తింటున్నారా? అయితే ఆ వ్యాధి రావడం ఖాయం..

Night Eating

Night Eating

ఈరోజుల్లో చాలా మంది ఒకసమయం సందర్భం లేకుండా తింటున్నారు.. పడుకుంటున్నారు.. అయితే రాత్రి పూట తినే భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి ఏడు గంటల లోపు భోజనం చెయ్యడం మంచిదట.. అలా కాదని రాత్రి 9 దాటిన తర్వాత తింటే ఆ వ్యాధులు రావడం కామన్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఎటువంటి నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం..

రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు సమస్యలు తలెత్తుతాయి. మీ జీర్ణవ్యవస్థ అసమతుల్యత చెందుతుంది.. అంతేకాదు నిద్రలేమి సమస్యలు వస్తాయి.. గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి 9 గంటల తర్వాత తినడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని, ఇది మెదడులోని రక్తనాళం పగిలి మెదడు చుట్టూ రక్తస్రావం అయినప్పుడు సంభవిస్తుందని తాజా అధ్యయనం సూచిస్తుంది..

రాత్రి ఆలస్యం తినడం వల్ల రక్తపోటు స్థాయిలు తీవ్రమైన హెమరేజిక్ స్ట్రోక్‌లతో సంబంధం కలిగి ఉంటాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత రక్తపోటు పెరిగి భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని చెప్పారు…రక్తనాళంలో కొవ్వు పరిమాణం పెరుగుతుంది మరియు స్ట్రోక్ సంభవం పెరుగుతుంది.. దానివల్ల నిద్రించిన తర్వాత పక్షవాతం బారిన అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. తిన్న వెంటనే నిద్రపోవడం తగ్గించాలి. ఇది ఎవరికీ సిఫారసు చేయకూడదు. తిన్న తర్వాత కొంచెం సేపు నడవాలి… ఆ తర్వాతే పడుకోవాలి.. లేకుంటే కడుపులో గ్యాస్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట.. అందుకే చెబుతున్నారు ఏడు గంటల లోపు ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.