NTV Telugu Site icon

Health Tips : పిల్లలకి పొరపాటున కూడా వీటిని పెట్టొద్దు..ఎందుకంటే?

Kids

Kids

పిల్లలది ఎదిగే వయస్సు..వారి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుల కోసం ప్రతి పేరెంట్ ఎన్నో విధాలుగా ఆలోచిస్తారు. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలలో ఆహారం కీ రోల్ పోషిస్తుంది. అయితే, కొన్ని ఫుడ్స్ పిల్లలకి అస్సలు మంచిది కాదు. వీటిని తీసుకోవడం వల్ల పిల్లలకి జ్ఞాపకశక్తిని మందగించి, బ్రెయిన్‌ని బలహీనపరుస్తాయి.. వాళ్ల ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎటువంటి ఆహారాన్ని వారికి ఇవ్వాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

* .ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారం మెదడు ఆరోగ్యం, అభివృద్ధిపై నెగెటీవ్ ఎఫెక్ట్‌ని చూపిస్తాయి. ఈ కొవ్వులు ఎక్కువగా ఫ్రై చేసిన ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్నాక్, హైడ్రోజనేటేడ్ నూనెలతో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి. ఇలాంటి ఫుడ్స్ పిల్లల మెదడులో వాపుని పెంచుతాయి. అదనంగా, ఇది రసాయనిక సెరటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని ప్రభావం డిప్రెషన్, మెమరీలాస్‌కి దారికతీస్తుంది.

*. పిల్లలకి షుగర్ ఫుడ్స్ అంటే ఇష్టం. కానీ ఈ స్వీట్స్ పిల్లల బ్రెయిన్ హెల్త్‌కి మంచిది కాదు. స్వీట్స్, ఐస్‌క్రీమ్స్, కేక్స్, బేబీ ఫుడ్స్‌లో చక్కెర చాలా ఉపయోగించబడుతుంది. దాని వల్ల హైపర్ యాక్టివిటీకి కారణమవుతుంది. పిల్లల ఆకలిని ప్రభావితం చేస్తుంది.

*. కలర్ ఫుల్ ఫుడ్ ను అస్సలు పెట్టకండి.. ఎందుకంటే.. దీని వల్ల పిల్లల్లో ఆందోళన, తలనొప్పి, హైపర్ యాక్టివిటీ, అభిజ్ఞా సమస్యలు వస్తాయి..

*. చాక్లెట్స్, టీ, కాఫీల్లోనూ కెఫిన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జలుబు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మరిన్ని సమస్యలు కూడా వస్తాయి. పిల్లలు రోజుకి 45 మిల్లీగ్రాముల వరకూ కెఫిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవచ్చు..కెఫిన్ డ్రింక్స్ తీసుకుంటే వణుకు, భయం, నిద్రలేమి, హైపర్‌యాక్టివ్, తలనొప్పి, కడుపునొప్పులు వస్తాయి..ఇవి పిల్లల మానసిక ఎదుగుదల పై ప్రభావాన్ని చూపిస్తాయి.. అందుకే వీటికి దూరంగా ఉంచడం మంచిది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.