Site icon NTV Telugu

Health Tips : రోజూ రాత్రి నానబెట్టిన శనగలను ఏంటే ఏమౌతుందో తెలుసా?

Soaked Chana Benefits

Soaked Chana Benefits

శనగలు గురించి అందరికి తెలిసే ఉంటుంది.. సౌత్ టు నార్త్ చాలా మంది వీటితో రకరకాల కూరలను చేస్తూ వస్తున్నారు.. వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.. అందుకే వీటిని ఎక్కువగా వాడుతున్నారు.. కొందరు ఈ శనగలను మొలకెత్తించి కూడా తీసుకుంటూ ఉంటారు. నల్ల శనగలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు… ఈ శనగలను ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్యం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ శనగలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు లో ఉంటాయి. అలాగే నల్ల శనగల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు వీటిని ఇవ్వడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలకు శనగలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.. జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..

వీటిలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడం లో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. జుట్టు ఒత్తుగా, ధృడంగా పెరుగుతుంది. బరువు తగ్గడంలో కూడా ఈ శనగలు మనకు ఎంతగానో సహాయపడతాయి. ఈ శనగలను రోజూ ముప్పావు కప్పు మోతాదులో తీసుకోవాలి.. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్ని వాటిని మరోసారి కడిగి ఉడికించి తీసుకోవడం మేలని నిపుణులు అంటున్నారు.. మొలకలు తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. వీటిని తీసుకున్న తర్వాత అరగంట వరకు ఏమి తీసుకోకుండా ఉండటం మంచిది..

Exit mobile version