NTV Telugu Site icon

Health Tips : చలికాలంలో లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా?

Cloves Tea

Cloves Tea

మన వంట గదిలో కూరలకు మసాల ఘాటును పెంచేవాటిలో లవంగాలు కూడా ఒకటి.. వీటిని కూరల్లోనే కాదు ఆరోగ్యం కోసం వాడుతారు.. ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. లవంగాలల్లో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో లవంగాలను వాడడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో చల్లటి వాతావరణం ఉంటుంది.. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

చలికాలంలో మన శరీరాన్ని వేడిగా ఉంచేందుకు లవంగాలు సహాయపడతాయి.. ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఇది రక్షిస్తుంది.. లవంగాలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్లూ, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. లవంగాలను గ్రీన్ టీ లో కలిపి తీసుకోవడం వల్ల చలికాలంలో ఎంతో మేలు కలుగుతుంది…

లవంగాలను తీసుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న దగ్గు కూడా తగ్గుతుంది.. అలాగే చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీంతో చలికాలంలో శక్తి స్థాయిల్లో వచ్చే మార్పులు రాకుండా ఉంటాయి. శరీరంలో శక్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అలాగే చలికాలంలో జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. తరుచూ అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.. చెడు కొలెస్ట్రాల్ ను కూడా కరిగించడంలో సహాయ పడుతుంది.. పంటి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments