NTV Telugu Site icon

Health Tips: ఉదయాన్నే పెరుగును తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Yogurt

Yogurt

ఉదయాన్నే పెరుగును తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు..మామూలు పెరుగు కాకుండా తయారు చేసిన పెరుగును తీసుకోవడం చాలా మంచిదట.. కాచిన పాలలో లాక్టోబాసిల్లస్ బల్గారికస్‌, స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్ వేసి పులియబెడతారు. ఉంటాయి. యోగర్‌ అనేక పోషకాలతో నిండి ఉంటుంది, మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే.. మంచి బ్యాక్టీరియా దీనిలో ఉంటుంది. సాధారణ పెరుగుకంటే.. యోగర్ట్‌లో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. యోగర్ట్‌లో విటమిన్‌ డి, బి2, బి 12 వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది.. పొద్దున్నే ఈ పెరుగును తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పెరుగులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి..దీనిలో ఎముకలు, దంతాలు, కండరాలకు అవసరమైన కాల్షియం, విటమిన్‌ డి, విటమిన్లు, మినరల్స్‌ మెండుగా ఉంటాయి.. అంతేకాదు ఈ పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ తగ్గిస్తాయి. ఉదయం పూట యోగర్ట్‌ తీసుకుంటే.. టైప్ 2 డయాబెటిస్‌, గుండె సమస్యలు, క్యాన్సర్‌ సహా అనేక దీర్ఘకాలక సమస్యలు ముప్పును తగ్గిస్తుందని చెబుతున్నారు..

ఈ పెరుగును తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది..ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రేగులలో నివసించే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ఈ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మీ ప్రేగులలో హానికరమైన బ్యాక్టీరియా సంఖ్యను తగ్గిస్తుంది. తద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఉదయం పూట యోగర్ట్‌ తింటే.. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి..యోగర్ట్‌లో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి, ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు. ఫైటోస్టెరాల్స్ గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పెరుగును మీరు కూడా తినడం అలవాటు చేసుకోండి..