Site icon NTV Telugu

Health Tips : చలికాలంలో జామ ఆకు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Teaaa

Teaaa

చలికాలం వచ్చిందంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదోక సమస్య మనల్ని వెంటాడుతుంది.. సీజనల్ వ్యాదులతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకోసమే చలికాలంలో ఆహారం, ఆరోగ్యం అలాగే జీవనశైలి విషయంలో కొన్ని రకాల మార్పులు తప్పనిసరి. ఇకపోతే చాలామంది చలికాలం ఎక్కువగా వేడి వేడి పదార్థాలను తాగడానికి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.. జామ ఆకు టీని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటంటే..

ఈ టీని రోజు ఉదయం తాగడం వల్ల ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులలో విటమిన్ సి అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఇన్ఫెక్షన్ లతో పోరాడటానికి సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉంటాయి.. ఈ టీని రోజూ తాగడం వల్ల గొంతు మంట తగ్గడంతో పాటుగా ఈ కాలంలో ఎక్కువగా భాధించే దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గుతాయని తెలుస్తుంది..

చలికాలంలో ఎక్కువగా అజీర్ణం, ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వేధిస్తుంటాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జామ ఆకుల్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి చలికాలంలో జామఆకు టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జామ ఆకు టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి.. ఇకపోతే బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. ఈ టీలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మ సమస్యలు కూడా పూర్తిగా తగ్గుతాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version