మన కోపమే మనకు పెద్ద శత్రువు.. మన కోపంలో ఏం చేస్తామో మనకు తెలియదు.. అందుకే అంటారు పెద్దలు తన కోపమే తనకు శత్రువు అని..మనం కోపం రాగానే వెంటనే అవతలి వ్యక్తి మీద మన కోపాన్ని మాటల ద్వారా వ్యక్తపరుస్తాము. అప్పుడు మనం మాట్లాడే మాటలు అవతలి వ్యక్తికి బాధను కలిగిస్తాయి. కాబట్టి మనం కోపంగా ఉన్నప్పుడు ఏమి మాట్లాడకుండా కాసేపు ఉండాలి తరువాత మాట్లాడాలి. అప్పుడు మనం ఆలోచించి మాట్లాడతాము.. అయితే కోపాన్ని ఏం చేసి తగ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కోపంలో ఉన్నప్పుడు ఏదైనా పని చేస్తే మీ కోపం దూరం అవుతుంది.. కోపం తగ్గడానికి వేగంగా నడవడం లేదా వేగంగా పరుగెత్తడం వంటివి చేయాలి. లేదా ఏదయినా వ్యాపకాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే కోపాన్ని తగ్గించుకోగలుగుతారు. మీరు ప్రశాంతంగా ఉన్న సమయంలో మీ ఆందోళనను అవతలి వ్యక్తికి వారికి బాధ కలుగకుండా తెలియజేయాలి.. మీకు కోపం ఉంటే పిల్లల మీద అసలు చూపించకూడదు.. కోపం తగ్గడానికి వారితో ఆదుకోవడం మంటివి చెయ్యాలి..
మనసుకి ప్రశాంతతని కలిగించే పని చేయాలి. అప్పుడే మనం ఒత్తిడి నుండి దూరం అవుతాము. కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము.. కోపంలో కొన్నిసార్లు తీసుకొనే నిర్ణయాలు బంధాలను దూరం చేస్తాయి.. కోపం వచ్చినప్పుడు ఏదో ఒక వ్యాపకం ద్వారా డైవర్ట్ చేసుకోవాలి. కాసేపు సైలెన్స్ మెయింటైన్ చేయాలి. కోపం మరీ ఎక్కువగా వస్తుంటే ధ్యానం, యోగా లాంటివి చేయాలి. ప్రశాంత వాతావరణంలో గడపడం,. ప్రకృతి లో కాసేపు గడపడం వంటివి చెయ్యాలి.. లేకుంటే మాత్రం బీపి, లేదా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. సో మీ కోపాన్ని తగ్గించుకోడం కూడా మీ చేతుల్లోనే ఉంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
