Site icon NTV Telugu

Health Tips : ప్రతి రోజు క్యాబేజీని ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Cabbage

Cabbage

క్యాబేజి లో పోషకాలు ఎక్కువగా ఉన్నాయి.. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డైట్ లో వాడుతున్నారు.. చాలా మంది క్యాబేజీ వాసన వస్తుందని తినటానికి అస్సలు ఇష్టపడరు కానీ క్యాబేజీ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. అయితే క్యాబేజిని నీటిలో వేసి ఉడికించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు.. ఇలా తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఎప్పుడు తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

క్యాబేజీలో పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉన్నాయి. క్యాబేజీ నీటిలో ఇండోల్-3 కార్బోనైట్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్‌ సమృద్దిగా ఉండుట వలన కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడి కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.. అలాగే కంటి సమస్యలను తగ్గిస్తుంది.. అంతేకాదు రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది.. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. చర్మం మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది..

క్యాబేజిని తీసుకోవడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు తగ్గి కాంతివంతంగా మారుతుంది.. మృదువుగా మారుతుంది.. ఈ చలికాలం చర్మం పొడిబారుతుంది.. ఇలా క్యాబేజిని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయి.. క్యాబేజీలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎముకలకు అవసరమైన బలాన్ని అందిస్తాయి.రక్తహీనత సమస్య తగ్గడమే కాకుండా రక్త సరఫరా బాగుంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. క్యాబేజీ లో ఉండే లక్షణాలు లివర్ ని శుభ్రపరిచి లివర్ పనితీరు బాగుండేలాగా చేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.. లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది.. అల్సర్ తో బాధపడేవారు ఈ నీటిని తాగితే.. జీర్ణాశయంలో.. పేగుల్లో పుండ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.. కాబట్టి క్యాబేజిని ఇలా తీసుకుంటే ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version