చాలా మంది తింటున్న సమయంలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. కొంతమందికి తినక ముందు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. అన్నం తినక ముందు నీరు తాగవచ్చు కానీ అన్నం తినేటప్పుడు అలాగే అన్నం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అలా తాగడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నీరు మన శరీరానికి చాలా అవసరం ఉంటుంది.. అందులో ఈ సమ్మర్ లో మరి ఎక్కువగా ఉంటుంది.. భోజనం చేసిన వెంటనే నీరు తాగడంవల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మొదటిగా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. నీరు తాగడంవల్ల కడుపులో ఉన్న యాసిడ్ పలుచన అవుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టంగా మారుస్తుంది. దీని వల్ల గ్యాస్, మలబద్ధకం సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి..
భోజనం చేసేటప్పుడు నీరు తాగడానికి దూరంగా ఉండాలి. చిన్న పిల్లలు అన్నం తినేటప్పుడు నీరు తీసుకోవచ్చు. అయితే పెద్దవారు మాత్రం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.. ఆహారం జీర్ణం అవ్వడానికి కనీసం రెండు గంటలు పడుతుంది.. నీరు తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఆహారం తీసుకున్న 45 నుంచి 60 నిమిషాల తర్వాతే మంచినీరు తాగాలి. ఆహారం తినే అరగంట ముందు నీళ్లు తాగాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.. భోజనం తిన్న వెంటనే పడుకోవడం కూడా చెయ్యకూడదు.. ఉభకాయం పెరిగే అవకాశం ఉంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.