Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Health Tips Do Not Take These At All Lives Will Be Lost

Health Tips: పరగడుపున వీటిని అస్సలు తీసుకోకండి.. ప్రాణాలు పోతాయి..

Published Date :September 21, 2023 , 9:36 am
By Swathi Maddula
Health Tips: పరగడుపున వీటిని అస్సలు తీసుకోకండి.. ప్రాణాలు పోతాయి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మనం ఉదయం లేవగానే కాఫీ, టీ తాగాలని అనుకుంటారు.. కొందరికి టీ చుక్క పడందే పొద్దు పొడవదు.. అయితే వీటిని పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..ఇవి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతాయని కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది.. ఇప్పటికే ఇలాంటి సమస్యలకు ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకుంటే ఇతర అనారోగ్యాల ప్రమాదం సైతం పెరుగుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొద్దున్నే నిద్ర లేచిన తరువాత మన శరీరానికి శక్తి, పోషకాలను అందించే ఆహారం తీసుకోవాలి. కెఫినేటెడ్ డ్రిక్స్‌కు దూరంగా ఉండాలి.. వీటితో కొన్నిటిని పరగడుపున తీసుకొకూదని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..

పరగడుపున ఎట్టిపరిస్థితుల్లోనూ కాఫీ తీసుకోకూడదు. డీకెఫినెటెడ్ కాఫీలకు కూడా దూరంగా ఉండటం మంచిది. కాఫీ మన కడుపులో యాసిడ్స్‌ను సృష్టిస్తుంది. ఖాళీ కడుపుతో కాఫీ తీసుకుంటే గుండెల్లో మంట లేదా ఇతర జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. బ్రేక్ ఫాస్ట్‌కు ముందే కాఫీ తాగడం అలవాటు చేసుకుంటే.. శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.. ఇది ఒత్తిడిని పెంచుతుంది..

ఇక కొంతమందికి పొద్దున్నే లేవగానే ఆల్కహాల్ ను తీసుకుంటారు.. అది చాలా ప్రమాదం.. పరగడుపున మద్యం తాగితే, శరీరం దాన్ని సాధారణం కంటే రెండు రెట్లు వేగంగా శోషించుకుంటుందని పరిశోధనల్లో తేలింది. దీనివల్ల మన శరీరం ఆల్కహాల్‌ను తొలగించే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది.. కొన్ని అవయవాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది..

పొద్దున్నే జంక్ ఫుడ్, బేకరీ ఉత్పత్తులు తీసుకుంటే శరీర అవయవాల్లో కొవ్వు పేరుకుపోతుంది. సాధారణంగా వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది..

ఇకపోతే నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లలో ఫైబర్‌తో పాటు యాసిడ్స్‌ ఉంటాయి. ఖాళీ కడుపుతో ఇలాంటి పండ్ల రసాలు తీసుకుంటే కడుపులో చికాకుగా అనిపించవచ్చు.. వికారంగా అనిపించడంతో పాటు.. జీర్ణ సమస్యలు పెరుగుతాయి..

ఇక చివరగా చూయింగ్ గమ్స్ జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి అధికమైతే, పేగుల సున్నితమైన పొరకు హాని కలిగిస్తాయి. ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే గ్యాస్ట్రిటిస్‌ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..వీటన్నికన్నా లేవగానే మంచి నీళ్లు తాగడం మంచిది.. కొందరు వేడి నీళ్లు కూడా తాగుతారు.. ఇవి కూడా మంచిదే..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • drinks
  • Empty Stomach
  • Health Issues
  • Health Tips

తాజావార్తలు

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!

  • AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

  • Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

  • Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions