ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. ముఖ్యంగా కూర్చొని తింటే బెల్లీ ఫ్యాట్ రోజు రోజుకు పెరుగుతుంది.. త్వరగా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు.. అది కూడా మన ఇంట్లో ఉండే మసాలా దినుసులతో అని చెబుతున్నారు.. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు ఎంత తొందరగా పెరిగినా తగ్గడం మాత్రం అంత సులువు కాదంటున్న ముచ్చట ఈ సమస్య ఉన్నవారికి బాగా తెలుసు. ఈ బరువును తగ్గించుకోవడానికి రకరకాల వ్యాయామాలు, యోగా, డైట్ వంటి ఎన్నో పద్దతులను పాటిస్తుంటారు. అయితే మీరు బరువు తగ్గడానికి కొన్ని మసాలా దినుసులు కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటో చూద్దాం..
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే మెంతులు మన శరీరానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం వాటిని తీసుకోవచ్చు. లేదా వీటిని పొడిగా కూడా తినొచ్చు..
చింతపండులో విటమిన్లు, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. చింతపండు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే హైడ్రోసిట్రిక్ మూలకం శరీరాన్ని తేమ నుంచి కాపాడుతుంది.. నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని 2 గ్లాసుల నీటిలో నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టిన తర్వాత చింతపండును ఉదయం వడగట్టి దాని రసం తాగాలి. దీనికి తేనె, బ్లాక్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును కూడా తగ్గిస్తుంది..
దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఈ మసాలా దినుసుల్లో విటమిన్స్, జింక్, ఫాస్పరస్, ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కను నీటిలో మరిగించి తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్య తగ్గడమే కాకుండా కూడా బరువు తగ్గుతారు. పెరుగుతున్న ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ రాత్రి పడుకునే గంట ముందు ఒక గ్లాసు నీటిలో దాల్చిన చెక్కను మరిగించి ఆ నీరు సగం కాగానే దించేసి తాగాలి.. సీజనల్ వ్యాదులు తగ్గడంతో పాటుగా బరువును కూడా తగ్గవచ్చు.. మీరు కూడా ట్రై చెయ్యండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
