NTV Telugu Site icon

Health Tips : పుదీనాతో పుట్టెడు లాభాలు.. రోజుకు రెండు ఆకులు తింటే చాలు..

Pudeena

Pudeena

పుదీనా లేకుండా బిర్యానిలు చెయ్యరు.. నాన్ వెజ్ వంటలను అస్సలు చెయ్యలేరు.. వంటలకు మంచి సువాసనను అందిస్తుంది.. అలాగే రుచికరంగా కూడా ఉంటాయి. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలుచేస్తాయి. ఈ ఆకులను ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు…పుదీనాలో మెంతోల్ ఉంటుంది. ఇది చల్లని అనుభూతిని కలిగిస్తుంది. వాయు మార్గాలను క్లియర్ చేస్తుంది. తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పుదీనాతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

*. పీరియడ్స్ సమయంలో భరించలేని తిమ్మిరితో బాధపడుతుంటారు చాలా మంది. అయితే ఇలాంటి వారికి పుదీనా ఆకులు మంచి మేలు చేస్తాయి. పుదీన కండరాలను శాంతపరుస్తుంది.అసౌకర్యాన్నితగ్గించడానికి సహాయపడే యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. పుదీనా రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది..

*. పుదీనా ఆకుల్లో మనకు విశ్రాంతి కలిగించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పుదీనా ఆకులను ఉపయోగించి ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. అందుకే దీన్ని తక్షణమే విశ్రాంతి కలిగించే అరోమాథెరపీలో ఉపయోగిస్తారు. పుదీనా వాసన చూసినా మనస్సు ప్రశాంతంగా మారుతుంది..

*. ప్రస్తుతం ఒకవైపు వర్షాలు, మరోవైపు వాతావరణం చల్లగా ఉంటుంది.. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. జలుబు, దగ్గు వంటివి కూడా వస్తుంటాయి.. అయితే ఈ సమస్యను తగ్గించడానికి పుదీనా ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రోజూ ఒక కప్పు పుదీనా టీని తాగండి. ఈ టీ గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది..

*. పుదీనా ఆకులు కూడా మన జీర్ణక్రియకు సహాయపడతాయి. కడుపు సమస్యలను కూడా పోగొడుతాయి. పుదీనాలో ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మెంతోల్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు పుదీనా కడుపునకు సంబంధించిన సమస్యలను వెంటనే తగ్గిస్తుంది..

*. చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయి. తలకు పుదీనా పెరుగు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.