Health Tips: మీకు కాఫీ తాగే అలవాటు లేదా ? అయితే రిస్కే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రెండ్స్ కలిసినా, లేక ఇంటికి బంధువులు వచ్చినా టీ, లేదా కాఫీ ఇస్తాం. అయితే మనలో చాలా మందికి రోజు కాఫీ, టీ తోనే మొదలవుతోంది. కాఫీ మన ఉదయాన్ని ఉత్తేజంగా స్టార్ట్ చేయిస్తోంది. అయితే అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ అధ్యయనంలో పలు రకాల కాఫీ తాగడం వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ అని తేలింది. కాఫీ తాగని వారికే ఎక్కువ డెత్ రిస్క్ అని ఈ అధ్యయనం తేల్చింది. యునైటెడ్ కింగ్డమ్లో 171,616 మందిని పరిశోధకులు అధ్యయనం చేశారు. కాఫీ తాగే అలవాటుతో సహా వారి జీవనశైలి గురించి ఒకె సంవత్సరంలో ఐదు సార్లు సర్వే చేశారు. ఏడేళ్ల తర్వాత సగటున ఎవరు మరణించారో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు మరణ ధృవీకరణ పత్రాలను సేకరించారు. సుమారు 37 నుంచి 73 సంవత్సరాల వయసు గలవారు ఈ సర్వేలు పాల్గొ్న్నారు. సర్వే సమయంలో వారికి హృదయ సంబంధ వ్యాధులు లేదా క్యాన్సర్ లేదని అధ్యయనంలో తేలింది.
కాఫీ తాగని వారికే రిస్క్ :
Also Read
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
రోజుకు 1.5 నుంచి 3.5 కప్పుల వరకు మితమైన మోతాదులో కాఫీ తాగే వ్యక్తులకు, కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీని తీసుకున్న వారికి 30% తక్కువ రిస్క్ ఉందని ఫలితాలు వెల్లడించాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో మెడిసిన్ ప్రొఫెసర్, అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌కి డిప్యూటీ ఎడిటర్ డాక్టర్ క్రిస్టినా వీ.. కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీ తాగేవారిలో 16% నుంచి 29% తక్కువ మరణ ప్రమాదం ఉందని తెలిపారు. ఈ అధ్యయనంలో సోషియోడెమోగ్రాఫిక్, లైఫ్‌స్టైల్, క్లినికల్ కారకాల అన్వేషణలు కూడా జరిగింది. పరిశోధనా బృందం పొగతాగే స్థాయి, శారీరక శ్రమ, విద్యా స్థాయి, ఆహారపు అలవాట్ల గురించి ప్రశ్నలు అనేక ప్రశ్నలు అడిగామని క్రిస్టినా వీ చెప్పారు. ఆదాయ స్థాయి, వృత్తి ఫలితాలను ప్రభావితం చేసే ఇతర అంశాల గురించి అడగలేదన్నారు.
ఒక టీ స్పూన్ షుగర్ తో ఎక్కువ ప్రయోజనం..
ఈ అధ్యయనం ప్రకారం కాఫీలో 1 టీ స్పూన్ చక్కెరను మాత్రమే వినియోగించినట్లు తెలుస్తోంది. “ఈ అధ్యయనం ఆధారంగా, చాలా మంది కాఫీ తాగేవారు తమ ఆహారం నుంచి పానీయాన్ని తొలగించాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కానీ అధిక కేలరీల స్పెషాలిటీ కాఫీల నుంచి జాగ్రత్తగా ఉండాలి” అని అధ్యయన రచయిత డాక్టర్ డాన్ లియు తెలిపారు. ఆమె చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ యూనివర్సిటీలో ఎపిడెమియాలజీ విభాగానికి చెందినవారు. కాఫీ తీసుకోవడం గుండెను కాపాడుతుందని, ఇతర వ్యాధుల చికిత్సలో సహాయపడుతుందని గత పరిశోధనలో తేలిందని లియు చెప్పారు. ఇది కాలేయ సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని 2021 అధ్యయనంలో తెలిసిందని లియు అన్నారు.
అరబికా,రోబస్టా రకాలు:
కాఫీ ఉత్పత్తి చేసే విధానంపై వివిధ ఆరోగ్య ప్రొఫైల్‌లను కూడా కలిగి ఉందని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌లో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ ప్రొఫెసర్ గుంటర్ కుహ్న్లే చెప్పారు. అయితే కాఫీలో అరబికా, రోబస్టా రకాలు ఉన్నాయి. పరిశోధన ప్రకారం రోబస్టా కాఫీలో అరబికా కాఫీ కంటే ఫినాలిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాల్చని, ఆకుపచ్చ కాఫీ గింజలు అధిక స్థాయిలో ఫినాలిక్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వేయించే స్థాయిని బట్టి కొన్ని ఫినోలిక్ సమ్మేళనాలు విచ్ఛిన్నమవుతాయి. కాఫీలో అధిక స్థాయిలో డైటర్పెనెస్ ఉంటుంది. ఈ రసాయన సమ్మేళనాలు, మీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని కుహ్న్లే చెప్పారు. 2016 అధ్యయనం ప్రకారం కాఫీ, ఫ్రెంచ్ ప్రెస్ కాఫీలో అత్యధిక మొత్తంలో డైటర్పెనెస్ ఉన్నాయి. మోచా, ఎస్ప్రెస్సో కాఫీలో మితమైన డైటర్పెనెస్ ఉంటాయి. అయితే ఇన్స్టంట్ కాఫీలు లేదా వడపోతతో తయారు చేయబడిన కాఫీల్లో వీటి శాతం అతి తక్కువగా ఉంటాయి.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?