Site icon NTV Telugu

Health Tips : మొక్క జొన్న పీచును పడేస్తున్నారా?.. ఇది తెలిస్తే అస్సలు పడేయ్యరు..

Sweet Corn

Sweet Corn

మన శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమే.. వాటిలో ప్రతి ఒక్కటి సరిగ్గా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు లేకుంటే మాత్రం వివిధ జబ్బులతో బాధపడుతుంటారు.. అలాంటి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి.. మన శరీరంలో రక్తాన్ని ఇవి వడపోస్తూ ఉంటాయి.. అందులో ఉండే మలినాలను బయటకు పంపిస్తూ ఉంటాయి.. అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కానీ ఈరోజుల్లో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు, విష పదార్థాలు ఎక్కువవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. మూత్రంలో క్యాల్షియం, సోడియం, పొటాషియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, ఫాస్పేట్ వంటివి ఉంటాయి.

ఇలాంటి ఎప్పుడైతే మూత్రంలో ఈ పోషకాల శాతం ఎక్కువవుతుందో అవి మూత్రపిండాల్లో పేరుకుపోయి చిన్న రాళ్ల లాగా ఏర్పడుతాయి. ఈ రాళ్లు క్రమంగా పెద్దవి అయ్యి తీవ్రమైన నొప్పికి దారి తీస్తాయి.. ఇంకా ఎన్నో సమస్యలకు దారీ తీస్తాయి.. అనేక సమస్యలు వస్తాయి.. కిడ్నీలో రాళ్లను కరిగించే న్యాచురల్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కిడ్నీలో రాళ్లను తొలగించడంలో మొక్కజొన్న పీచు ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న పీచుతో టీ ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం ఈ సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ముందుగా ఒక గిన్నెలో 4 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఒక మొక్కజొన్న పీచును వేసి నీళ్లు సగం అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి కప్పులోకి తీసుకోవాలి. తరువాత వీటిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం, 2 టీ స్పూన్ల ఆలివ్ నూనె వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని ఉదయం సాయంత్రం రెండు పూటలా భోజనం చేసిన అరగంట తర్వాత తాగాలి.. కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.. అలాగే రణపాలా ఆకును తీసుకున్న మంచిది ఫలితం ఉంటుంది.. అంతేకాదు ముల్లంగిని తీసుకున్న కూడా మంచిది ఫలితం ఉంటుందని కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version