అమ్మ అవ్వడం అంటే మహిళకు గొప్ప వరం..గర్భవతిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే గర్భం నిలబడం కష్టం. పాత కాలంలో అయితే గర్భవతులుగా ఉన్న స్త్రీలు ఇంటి పని చేసుకుని సమయం దొరికితే అవి ఇవి కావాలని చేయించుకొని తింటూ సరదాగా ఉండేవారు.. కానీ ఇప్పుడు బిజీ లైఫ్ ను గడుపుతున్నారు.. డెలివరీ రేపో, మాఫో అవుతారన్న ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉంటారు.. ఇక పనిలో పడి చాలా మంది సరిగ్గా ఆహారాన్ని తీసుకోవడం లేదు.. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. అందుకే ఈ టిప్స్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు..
ఆఫీసులకు వెళ్లే మహిళలు పౌష్టికాహారాన్ని తీుకోవాలి. ముఖ్యంగా మీ భోజనం ఆకు కూరలు, కూరగాయలు వంటివి ఉండాలి. అలాగే ఫోలిక్ యాసిడ్స్ వంటి ఫుడ్స్ కూడా ఉండేలా జాగ్రత్త పడాలి. మజ్జిగ లేదా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లు తీసుకోవడం మంచి ఛాయిస్. నీరు కూడా తాగుతూ ఉండాలి..
ఆఫీసులో కూర్చొని పని చేస్తూ ఉంటే మాత్రం గంట లేదా రెండు గంటలకు ఓ చిన్న బ్రేక్ తీసుకోవడం ఉత్తమం. దీని వల్ల మీ మూడ్ అనేది మారుతుంది. ఇలాంటి సమయంలో కుదిరితే వర్క్ ఫ్రమ్ చేయడం బెటర్ ఆప్షన్..
వీలైనంత వరకూ జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటి వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కడుపులో తిప్పడం, వాంతులు అవడం వంటివి జరుగుతూ ఉంటాయి. తినాలనిపిస్తే ఏదో కొంచెం తిని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి..
ఏది తీసుకున్నా లిమిట్ గానే తీసుకోవాలి.. మంచి డైట్ ను ఫాలో అవ్వాలి.. ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.. ఈ డైట్ ను ఫాలో అయితే ఇక ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.