Site icon NTV Telugu

Health News: ఏసీలో కూర్చున్నవారికి పైల్స్ వస్తాయా?

Health

Health

ఏసీలో కూర్చొని పని చేసే వాళ్ళకి పైల్స్ వస్తాయా..? | Dr Venkateswarlu | Ntv Health Telugu

ఈమధ్యకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు, ఏసీల్లో వుండేవారికి బాధించే ప్రధాన సమస్య పైల్స్. హెమరాయిడ్స్.. మలద్వారం దగ్గర మొదలయ్యే ఈ పైల్స్ సమస్య ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. సరిగా కూర్చోలేరు.. నిలబడలేరు అన్నట్లుగా వుంటుంది వీరి పరిస్థితి. కొన్నిసార్లు మొలల సమస్యను తగ్గించుకునేందుకు ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది. సాధారణంగా మొలలు జన్యు కారణాలు, వృద్ధ్యాప్యంకి చేరుకుంటున్నకొద్దీ ఎక్కువ అవుతుందని చెబుతారు. గర్భవతుల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. తరచుగా పొట్ట భాగంలో వచ్చే ఒత్తిడి వల్ల మలద్వారం దగ్గరి సిరలు పొంగి, వాచి మొలలుగా మారతాయి. ఊబకాయం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరో ముఖ్యకారణం, ఆహారపు అలవాట్లు. మన జీవనశైలిలో ఆహారం చాలా ముఖ్యమైన అంశం, అనారోగ్యకరమైన ఆహారం తినటం వల్ల అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయి. మొలలు కూడా వాటిల్లో ఒకటి అని చెప్పవచ్చు. ఈ మొలల సమస్యకు పరిష్కారం ఏంటో డాక్టర్ చెబుతున్నారు.

Exit mobile version