Site icon NTV Telugu

Health Tips: గుడ్ న్యూస్.. మందులు లేకుండా షుగర్ మాయం..

Diabetes Control

Diabetes Control

Health Tips: సంసారం అనే సాగరాన్ని ఈదడానికి, కుటుంబ అనే బండిని ముందుకు నడిపించడానికి పొద్దున బయటికి వచ్చి రాత్రికి ఇంటికి వెళ్లే ఎందరికో ఈ వార్త గుడ్ న్యూస్. ఈ ఆధునిక జీవన శైలిలో మనిషి ఎన్నో రకాల రోగాలతో సతమతమౌతున్నాడు. ఈ రోగాల్లో షుగర్ కొంచెం ప్రమాదకరమైంది. కానీ నేడు ఈ వ్యాధి సర్వసాధారణమైన సమస్యగా ప్రతి ఒక్కరి జీవితంలో మారింది. కొందరికి ఈ వ్యాధి వారసత్వంగా సంక్రమించే ఆస్తిగా ఉంటే, మరికొందరికి వారికి జీవనశైలి ఇచ్చిన కానుకగా మారింది. ఇంతకీ మందులు లేకుండా షుగర్ వ్యాధిని నయం చేయడం సాధ్యమేనా.. కచ్చితంగా చేయవచ్చని చెబుతున్నారు. ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: రాజకుమారి వస్త్రంలో మీనాక్షి చౌదరి అద్భుతమైన అందం

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. అధిక రక్త చక్కెరను నియంత్రించకపోతే, అది దీర్ఘకాలంలో గుండె, రక్త నాళాలకు నష్టం, న్యూరోపతి, మూత్రపిండాల వైఫల్యం, కళ్ళు, పాదాలకు వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మొదట చక్కెర, బ్రెడ్, వైట్ రైస్ వంటి కార్బోహైడ్రేట్‌లను తగ్గించాలని సూచిస్తున్నారు. 2005 అధ్యయనంలో తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, బరువును తగ్గించడానికి, ఇన్సులిన్ అవసరాలను తగ్గించడానికి సహాయపడతాయని తేలింది. హార్వర్డ్ హెల్త్ బ్లాగ్ ప్రకారం.. తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు ప్రీడయాబెటిస్ రోగులలో A1C స్థాయిలను త్వరగా ఆరోగ్యకరమైన పరిధిలోకి తీసుకురాగలవని చెబుతున్నారు.

మూడు పూటలా భోజనానికి బదులుగా రోజుకు 5-6 సార్లు తక్కువ మోతాదు భోజనాలు తినండి. పుష్టిగా భోజనాలు చేయడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి, తగ్గడానికి కారణమవుతాయి. ఇది అలసట, కోరికలకు దారితీస్తుంది. చిన్న, సమతుల్య భోజనాలు రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతాయి. ఇన్సులిన్ పై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది సహాయపడితే, 12 వారాల పాటు కొనసాగించండి. రక్తంలో చక్కెర కోసం ఆహారం, సమయం రెండింటినీ సరిచేసుకోండి. ఫలితాలు కనిపిస్తాయి అని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం టీలో చిటికెడు దాల్చిన చెక్కను జోడించమని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఫాస్టింగ్ గ్లూకోజ్ 18-29 శాతం తగ్గి HbA1c మెరుగుపడుతుందని పేర్కొన్నారు. 2023 అధ్యయనంలో సలాడ్ తినడం వల్ల కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తుందని వెల్లడైనట్లు చెప్పారు.

వారానికి మూడుసార్లు కాకరకాయ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. 2017 అధ్యయనంలో టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో కాకరకాయ రసం తాగిన 90 నిమిషాల తర్వాత చక్కెర స్థాయి తగ్గిందని తేలింది. చక్కెరకు బదులుగా స్టెవియా లేదా మాంక్ ఫ్రూట్ వాడాలని సూచిస్తున్నారు. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. తక్కువ కేలరీల కారణంగా బరువును కూడా నియంత్రిస్తుందని పేర్కొన్నారు. సాధారణ పిండి పదార్థాలు అంటే తెల్ల రొట్టె, పేస్ట్రీలు, చక్కెర పానీయాలు త్వరగా గ్లూకోజ్‌గా మారి రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి కారణమవుతాయి. బదులుగా, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి సంక్లిష్ట పిండి పదార్థాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇవి గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయని, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. భోజనం చేసిన తర్వాత 20-30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుందని, గ్లూకోజ్ నియంత్రణలో సహాయపడుతుందని చెబుతున్నారు.

READ ALSO: Hyderabad kidnapping: బాబోయ్ బూచోళ్లు.. కొండాపూర్‌లో చిన్నారి కిడ్నాప్‌కు యత్నం

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version