Site icon NTV Telugu

Benefits of Raspberries: రాస్ బెర్రీస్ తింటే గుండెకు ఎంత మంచిదో తెలుసా..

Untitled Design (29)

Untitled Design (29)

ప్రస్తుతం మన ఉన్న సమాజంలో ప్రతి ఒక్కటి కలుషితం అవుతుంది. ఏం తినాలన్నా భయపడుతూ.. తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యంగా ఉండాలంటే.. శుధ్దమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. రోజు కూరగాయలతో పండ్లు కూడా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే మీరు ఎప్పుడైనా రాస్ బెర్రీస్ తిన్నారా.. ఈ పండ్లు చూసేందుకు ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. పైగా వీటిలో ఎన్నో రకాలైన పోషక విలువలను కలిగి ఉన్నాయని న్యూట్రిషన్స్ చెబుతున్నారు.

Read Also: Dharmendra : ధర్మేంద్రను ఐసియులో రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తి అరెస్ట్

రాస్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్ లు, విటమిన్ సీ, ఇ, ఆంథోనిసైనిన్‌, ఎల్లజిక్‌ యాసిడ్‌ ఉంటాయి. వి ఫ్రీర్యాడికల్‌ డ్యామేజ్‌ కాకుండా ఉండేందుకు ఇవి సహాకరిస్తాయి. అంతే కాకుండా.. రాస్ బెర్రీలలో ఎక్కువగా ఫైబర్ ఉండడంతో జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనే వారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయని.. గుండెను ఆరోగ్యంగా ఉండేందుకు సహాకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Read Also:Shocking Murder: మరిదితో వివాహేతర సంబంధం .. భర్తను నరికి చంపిన భార్య

రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు రాస్ బెర్రీలు పనిచేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. పోటాషయంతో అవసరమైన పోషకాలన్నీ ఇందులో ఉంటాయిని.. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుందని పేర్కొన్నారు. అయితే వీటిలో అధిక స్థాయిలో ఆంథోసైనిన్లు, క్వెర్సెటిన్, విటమిన్ సి ఉండడం వల్ల.. కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా ఇది తగ్గించేందుకు రాస్ బెర్రీస్ దోహదం చేస్తాయి. రాస్బెర్రీస్‌ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. వీటిని తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. చర్మం ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో రాస్ బెర్రీస్ ఎంతగానో సహాకరిస్తాయి.

Exit mobile version