Site icon NTV Telugu

Health Benefits of Amla: ఉసిరి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో మీకు తెలుసా…

Untitled Design (10)

Untitled Design (10)

రోజు మనం దిన చర్యలో భాగంలో ఒక ఉసిరి కాయను నమలడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే పచ్చి ఉసిరి కాయ తిన్నా.. లేక జ్యూస్ రూపంలో తీసుకున్నా.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి.

Read Also: Best LED Projector: ఇంట్లో థియేటర్ ఫీలింగ్ రావాలంటే.. ఇదే బెస్ట్ ఆఫ్షన్…

ఉసిరి కాయలు రోజు తినడంతో ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉసిరి తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజూ ఒక ఉసిరి కాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. రోజూ ఉసిరి పచ్చిగా తిన్నా లేదంటే జ్యూస్‌ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. .ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి. ఉసిరి ఈ కాలంలో వేధించే చుండ్రుని నివారించి కురులు చక్కగా పెరగడానికి కారణం అవుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఉసిరిని సలాడ్‌, జ్యూస్‌, మురబ్బాల రూపంలోనూ తీసుకోవచ్చు.

Read Also:Suicide: రెండేళ్ల కుమార్తెతో ట్యాంక్ బండ్ లో దూకి వివాహిత ఆత్మహత్య

ఉసిరిలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అయితే.. వీటిని రెగ్యులర్ గా తీసుకవడంతో.. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటుగా.. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చర్మానికి, జుట్టు సమస్యలు ఉన్న.. అవి తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఉసిరికి ఒత్తిడిని తగ్గించే గుణముంది. దీనిలోని ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌తో పోరాడి ఒత్తిడి తగ్గిస్తాయి.

Exit mobile version