NTV Telugu Site icon

Garlic Side Effects: వెల్లుల్లి ఎక్కువగా తింటున్నారా?.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!

Garlic

Garlic

Do Not Eat Too Much Garlic: ‘వెల్లుల్లి’ భారతీయ వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే పదార్థం. దీన్ని ప్రతి కూరలో వేస్తారు. వెల్లుల్లిని కూరలో వేస్తే.. మరింత రుచిగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే కొంతమంది అయితే వెల్లుల్లిని నేరుగానే తింటారు. వెల్లుల్లిలో విటమిన్ బి1, కాల్షియం, కాపర్, పొటాషియం, ఫాస్పరస్ మరియు ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వెల్లుల్లికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కాబట్టి వెల్లుల్లిని మితిమీరి తినకుండా.. పరిమిత పరిమాణంలో వాడాలి.

వెల్లుల్లిని ఎక్కువగా ఎందుకు తినకూడదో ఇప్పుడు చూద్దాం. గ్రేటర్ నోయిడాలోని జిమ్స్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ ఆయుషి యాదవ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లుల్లిని ఆయుర్వేదం యొక్క నిధిగా పరిగణించారు. అయితే అధికంగా తీసుకుంటే వచ్చే అనారోగ్య సమస్యలను (Garlic Side Effects) వివరించారు. వెల్లుల్లిని తినేటప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

గుండెల్లో మంట:
పరిమాణం కంటే ఎక్కువ వెల్లుల్లిని తింటే గుండెలో మంట సమస్య వస్తుంది. నిజానికి వెల్లుల్లిలో ఆమ్ల సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి అధికంగా తీసుకుంటే ఛాతీలో తీవ్రమైన మంట వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం.

Also Read:
Skin Care Tips: ఈ హోం రెమెడీ ట్రై చేస్తే.. మీ ముఖం చందమామలా మెరుస్తుంది!
అల్ప రక్తపోటు:
తక్కువ రక్తపోటు ఉన్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది హైపోటెన్షన్‌కు కారణమవుతుంది. ఇది శరీరంలో బలహీనత మరియు అలసటను కలిగిస్తుంది. కాబట్టి వెల్లుల్లని తీసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి.

చెడు శ్వాస:
వెల్లుల్లి ప్రభావం ఘాటుగా ఉంటుంది. కాబట్టి జలుబు చేసినపుడు వీటిని నేరుగా తింటారు. కొందరు అతిగా తింటారు. దీని కారణంగా ఘాటైన వాసన వస్తుంది. ఇది చుట్టుపక్కల వారికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. కాబట్టి వెల్లుల్లిని పరిమితం చేయండి.

Also Read: CWC Qualifiers 2023: వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ.. జింబాబ్వే ప్లేయర్ అరుదైన రికార్డు!

Show comments