Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
- మంచు తొలగించే సులభ మార్గాలు
- వేడి నీరు, డ్రైయర్‌తో ఈజీ క్లీనింగ్
- పదునైన వస్తువులు వాడొద్దు
- మళ్లీ ఐస్ పేరుకుపోకుండా చిట్కాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Freezer Cleaning Hacks: చాలామంది ఇళ్లలో ఫ్రిజ్ ఫ్రీజర్‌లో ఐస్ కొండలా పేరుకుపోతూ ఉంటుంది. ఇలా ఫ్రీజర్‌లో విపరీతంగా మంచు గడ్డకట్టడం వల్ల లోపల స్థలం తగ్గిపోవడమే కాకుండా, ఫ్రిజ్ కూలింగ్ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. దీనివల్ల కరెంట్ బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది. అంతేకాదు, ఫ్రీజర్ డ్రాయర్లు జామ్ అయిపోయి సరిగ్గా మూసుకోవు. లోపల పెట్టిన ఆహార పదార్థాలకు సరైన చల్లదనం అందక అవి త్వరగా పాడైపోతాయి. ముఖ్యంగా ఆటో డీఫ్రాస్ట్ (Auto Defrost) ఆప్షన్ లేని పాత మోడల్ ఫ్రిజ్‌లలో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ సమస్యకు సులువైన, సురక్షితమైన పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మంచును తొలగించే ముందు చేయాల్సిన మొదటి పని
ఫ్రీజర్ నుండి మంచును క్లీన్ చేయడానికి ముందు భద్రత కోసం ఫ్రిజ్ ప్లగ్‌ను సాకెట్ నుండి తీసేయండి (పవర్ ఆఫ్ చేయండి). ఆ తర్వాత ఫ్రీజర్‌లో ఉన్న ఆహార పదార్థాలన్నింటినీ బయటకు తీయాలి. ఈ వస్తువులు పాడవకుండా ఉండటానికి ఐస్ ప్యాక్‌లు ఉన్న కూలర్ బ్యాగ్, ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి పక్కన ఉంచుకోవడం మంచిది.
Also Read
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
- Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
- Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
- Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
వేడి నీటి ఆవిరి చిట్కా
ఫ్రీజర్‌లోని గట్టి మంచును త్వరగా కరిగించడానికి వేడి నీటిని ఉపయోగించవచ్చు. ఒక పాత్రలో నీటిని బాగా మరిగించి, ఆ వేడి నీటిని గాజు లేదా సిరామిక్ గిన్నెల్లో నింపండి. ఆ గిన్నెలను ఫ్రీజర్ లోపల పెట్టండి. అయితే, వేడికి లోపలి భాగం లేదా గాజు గిన్నె పగిలిపోకుండా ఉండటానికి గిన్నెల కింద ఒక మందపాటి టవల్ లేదా చెక్క ప్యాడ్ ఉంచడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఫ్రీజర్ డోర్ మూసి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు వదిలేయండి. ఆ వేడి ఆవిరి వల్ల మంచు గడ్డలు ఈజీగా వదిలిపోతాయి.
హెయిర్ డ్రైయర్ కూడా వాడుకోవచ్చు
ఫ్రీజర్‌లో గట్టిగా పేరుకుపోయిన మంచును కరిగించడానికి మన ఇంట్లో ఉండే హెయిర్ డ్రైయర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. డ్రైయర్‌ను తక్కువ లేదా మీడియం సెట్టింగ్‌లో ఉంచి, మంచుకు కాస్త సురక్షితమైన దూరం నుండి వేడి గాలిని ఊదండి. మంచు సమానంగా కరగడానికి డ్రైయర్‌ను ఒకేచోట పెట్టకుండా నెమ్మదిగా అటు ఇటు తిప్పండి. ఈ క్రమంలో మంచు కరిగి నీరు బయటకు రాకుండా ఉండేందుకు ఫ్రీజర్ కింద ఒక మంచి కాటన్ క్లాత్ లేదా నీటిని పీల్చుకునే గుడ్డను ఉంచండి.
వేడి నీటి టవల్ ట్రిక్
ఇంకొక సులువైన పద్ధతి ఏంటంటే.. ఒక చిన్న టవల్‌ను వేడి నీటిలో నానబెట్టి, పిండిన తర్వాత ఆ వేడి టవల్‌ను ఫ్రీజర్‌లోని మంచు మీద కొన్ని నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల మంచు గడ్డలు త్వరగా మెత్తబడతాయి.
ముఖ్య గమనిక: ఫ్రీజర్‌లోని మంచును త్వరగా తీసేయాలనే కంగారులో ఏ కారణం చేతనైనా కత్తి, స్క్రూడ్రైవర్ వంటి పదునైన లోహపు వస్తువులను అస్సలు ఉపయోగించవద్దు. అలా చేస్తే ఫ్రీజర్ లోపలి భాగం శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. మంచు కాస్త మెత్తబడ్డాక ప్లాస్టిక్ గరిటె, స్క్రాపర్ లేదా చెక్క స్పూన్‌తో సున్నితంగా తొలగించండి.
మళ్ళీ మంచు పేరుకుపోకుండా ఉండాలంటే?
పరిశోధనల ప్రకారం.. ఫ్రీజర్‌లో పదే పదే మంచు గడ్డకట్టకుండా ఉండటానికి కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించాలి. ఫ్రీజర్ తలుపును ఎప్పుడూ ఎక్కువ సమయం పాటు తెరిచి ఉంచకూడదు, పని కాగానే గట్టిగా మూసేయాలి. ఫ్రిజ్ డోర్‌కు ఉండే రబ్బర్ సీల్స్ (గ్యాస్కెట్) ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఆ రబ్బర్ సీల్లో ఏవైనా పగుళ్లు , లీకులు ఉంటే వెంటనే రిపేర్ చేయించాలి. దీనివల్ల బయట గాలి లోపలికి వెళ్లకుండా ఉంటుంది. వండిన వేడి ఆహార పదార్థాలను అలాగే ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అవి పూర్తిగా చల్లారిన తర్వాతే లోపల పెట్టాలి. అలాగే, ఫ్రీజర్ నిండా వస్తువులను ఉక్కిరిబిక్కిరిగా కుక్కేయకుండా కొద్దిగా గ్యాప్ ఉంచడం మంచిది.
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!