How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to Make Hara Saag: రోజువారీ పప్పు తిని విసుగొచ్చిందా? అయితే ఈ చలికాలంలో వేడివేడిగా, నోటికి కారకారంగా ఉండే “హరా సాగ్” (Hara Saag) ట్రై చేయండి. మార్కెట్లో దొరికే తాజా ఆకుకూరలతో చేసే ఈ వింటర్ స్పెషల్ డిష్.. రోటీలు, అన్నంలోకి తింటే అద్దిరిపోతుంది. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఈ వింటర్ స్పెషల్ హరా సాగ్ (Winter Special Hara Saag) తయారీకి కావాల్సిన పదార్థాలు, బాగోగులు చూసేద్దాం రండి.
కావాల్సిన పదార్థాలు (Ingredients):
తాజా ఆకుకూరలు (పాలకూర, బథూవా, మెంతికూర, ఆవాల ఆకులు): 1 కిలో
మక్కపిండి లేదా శెనగపిండి : 3 టేబుల్ స్పూన్లు
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ : 3 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ, టొమాటో: ఒక్కోటి తరిగినవి
నెయ్యి లేదా నూనె: 3-4 టేబుల్ స్పూన్లు
ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు: రుచికి సరిపడా
Also Read
- Best Flour for Winter: జొన్న, రాగి, మొక్కజొన్నలో ఏది బెస్ట్?.. చలికాలంలో ఏ పిండి రొట్టెలు తినాలి..?
- Potato Snacks: బండి మీద కంటే టేస్టీగా.. ఇంట్లోనే క్రిస్పీ ఆలూ పకోడీలు! తింటే వదిలిపెట్టరు..
- Kulfi Recipe: దీపావళికి మిగిలిపోయిన స్వీట్లతో టేస్టీ హోమ్మేడ్ కుల్ఫీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ రెసిపీ
- Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
రుచిగా రావడానికి చిన్న సీక్రెట్ టిప్స్:
ఒకే రకమైన ఆకుకూర కాకుండా పాలకూర, మెంతి, బథూవా కలిపి వండటం వల్ల కూరలో ఉన్న చేదు పోయి రుచి చాలా బాగా వస్తుంది. అలాగే ఉడికిన తర్వాత పప్పు గుత్తితో లేదా పొటాటో మ్యాషర్తో బాగా మెదిపితేనే (Mash) సాగ్ క్రీమీగా, పర్ఫెక్ట్ టెక్చర్‌తో వస్తుంది.
తయారీ విధానం (Step-by-Step Recipe):
మొదటగా తరిగి పెట్టుకున్న ఆకుకూరలను కుకర్‌లో వేసి, కొద్దిగా నీళ్లు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీన్ని కొద్దిగా చల్లార్చి పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. మధ్యమధ్యలో మక్కపిండి లేదా శెనగపిండి చల్లుకుంటూ తిప్పుకుంటే సాగ్ చక్కగా బైండ్ అవుతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీలో అసలైన దేశీ నెయ్యి లేదా ఆవనూనె వేసి వేడి చేయాలి. అందులో ఇంగువ, జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత తరిగిన టొమాటోలు, కొద్దిగా కారం వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఆకుకూర మిశ్రమాన్ని ఈ మసాలాలో కలిపి, చిన్న మంటపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికిస్తే మసాలా ఫ్లేవర్ అంతా సాగ్కి పడుతుంది. ఇక అంతే! ఎంతో రుచికరమైన, పోషకాలు నిండిన వేడివేడి హరా సాగ్ రెడీ. ఈ చలికాలంలో దీన్ని వేడివేడి రొట్టెలు లేదా అన్నంతో కలిపి లాగిస్తే ఆ మజాయే వేరు!
తాజావార్తలు
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
Anirudh Kavya Maran Wedding: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
-
Heart Health Tips: గుండె ఆరోగ్య రహస్యం ఇదే.. మంచి ఆహారంతో పాటు మంచి అనుబంధాలు కూడా!
-
Virender Sehwag: “కుర్రోడు కుమ్మేశాడు”.. గిల్, వైభవ్ సూర్యవంశీ క్లబ్లో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ ముద్దుల కొడుకు..
-
Traffic Rules: పాత బైక్‌లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’