ప్రస్తుత కాలంలో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వ్యాధులతో చాల మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. మధుమేహం నియంత్రణలో లేకుంటే గుండె జబ్బులు, కిడ్నీలు, ఊపిరితిత్తులు వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఊబకాయం, మధుమేహం రెండింటినీ నియంత్రించడంలో మనం తినే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు రాగులను తీసుకుంటే మధుమేహం, ఊబకాయం రెండింటినీ సులభంగా నియంత్రించవచ్చు. అంతే కాకుండా.. రాగుల వినియోగంతో ఇతర ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
రాగులు చూడటానికి చిన్నగా, ఆవాలు లాగా సన్నగా ఉంటాయి. డయాబెటిక్ రోగులు రాగులను తీసుకుంటే రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయని అనేక పరిశోధనలు వెల్లడించాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాగుల్లో బి1, బి2, బి6, కె విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫోలేట్, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రాగులు తినడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. రాగులు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
YS Vijayamma: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ లేఖ.. ఈ సమస్య వారే పరిష్కరించుకుంటారు..
రాగులు చక్కెరకు వరం:
చెడు కొలెస్ట్రాల్‌ను నివారించడంలో రాగులు చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలకు కూడా రాగులు చాలా మేలు చేస్తాయి. ఇవి చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలను కలిగి ఉంటాయి. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. అందుకే రాగులను మధుమేహానికి వరం అని అంటారు.
రక్తహీనత:
రక్తహీనతకు కూడా రాగు చాలా మేలు చేస్తుంది. దీంతో చర్మంపై ముడతలు రావు.. ముఖం మెరుస్తుంది. రాగులు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రాగులను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మీకు తగినంత కాల్షియం లభిస్తుంది.
ఎముకలు దృఢంగా మారుతాయి:
రాగులతో తయారు చేసుకున్న రొట్టె తినడం వల్ల ఎముకల సాంద్రతను పెంచుతుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రాగి జావా తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, ప్రొటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, ఖనిజాలను అందించడంతో పాటు ఎముకలను బలపరుస్తుంది.