దక్షిణ భారతీయులకు బ్రేక్‌ఫాస్ట్ అన్నా, పండగ నైవేద్యాలన్నా మొదట గుర్తొచ్చేది ‘కట్టె పొంగలి’. అయితే చాలామందికి హోటల్‌లోనో లేదా గుడిలోనో దొరికే ఆ కమ్మని రుచి ఇంట్లో రాదు. ఆ వెన్నలా కరిగిపోయే రుచి రావాలంటే కేవలం పప్పు, బియ్యం ఉడికించడమే కాదు, ఒక చిన్న రహస్య చిట్కా కూడా పాటించాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ మ్యాజిక్ రుచికి కారణం ఏంటి?
సాధారణంగా మనం పప్పు, బియ్యాన్ని నేరుగా ఉడికిస్తాం. కానీ ఈ పద్ధతిలో, ముందుగా పెసరపప్పును సన్నని సెగపై దోరగా వేయించాలి. ఇలా చేయడం వల్ల పొంగలికి అద్భుతమైన సువాసన వస్తుంది. ఆ తర్వాత, ఉడికించే ముందు పప్పు , బియ్యాన్ని వెన్న (Butter) లో ఐదు నిమిషాల పాటు వేయించాలి. ఈ చిన్న స్టెప్ వల్ల పొంగలి నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోతుంది.
తయారీలో ముఖ్యాంశాలు:
సరైన కొలత: ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. వీటికి ఆరు కప్పుల నీళ్లు పోస్తేనే పొంగలి సరైన కన్సిస్టెన్సీలో వస్తుంది.
వెన్నతో వేయించడం: కుక్కర్‌లో వెన్న వేసి, అందులో కడిగిన బియ్యం, పప్పును వేయించి, ఆ తర్వాతే మరిగించిన నీళ్లను పోయాలి. ఇలా చేయడం వల్ల పొంగలి ముద్దగా అవ్వకుండా కమ్మగా ఉంటుంది.
TG Cabinet Meeting : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. హైకోర్టు తీర్పుపై చర్చ
కమ్మని తాలింపు: కట్టె పొంగలికి అసలైన రుచిని ఇచ్చేది తాలింపే. ముప్పావు కప్పు నెయ్యిలో మిరియాలు, అల్లం తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి, జీడిపప్పు , ఇంగువ వేసి దోరగా వేయించి పొంగలిలో కలపాలి.
ఎలా తింటే బాగుంటుంది?
వేడివేడిగా తయారైన ఈ కట్టె పొంగలిని పల్లి చట్నీ లేదా సాంబార్‌తో వడ్డిస్తే, ఇంట్లో వారు ఒక ప్లేట్ ఎక్స్ట్రా అడిగి మరీ తింటారు. ఈ సారి ఏదైనా పూజ ఉన్నా లేదా కమ్మని బ్రేక్‌ఫాస్ట్ తినాలనిపించినా, ఈ స్టార్ హోటల్ స్టైల్ టిప్స్ పాటిస్తూ కట్టె పొంగలిని ట్రై చేయండి.
