సాధారణంగా శ్రావణం మాసం, కార్తీక మాసాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతాయి. మాంసం, గుడ్ల ధరలు అమాంతం తగ్గిపోతాయి. అయితే కార్తీక మాసం ఈ గురువారంతో ముగుస్తుంది.. అయినప్పటికి గుడ్ల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదంతా మెంథా తుఫాన్ ఎఫెక్ట్ అని మార్కెట్ యజామన్యం చెబుతుంది.
Read Also: Prashant Kishor: నా సంకల్పం నెరవేరేదాకా వెనక్కి తగ్గేదే లే.. ఓటమిపై ప్రశాంత్ కిషోర్ తొలి స్పందన
కార్తీక మాసం అయిపోవడానికి వచ్చినప్పటికి నిత్వవసరాల ధరలు తగ్గడం లేదు. దళారులంతా ఏకమై.. కూరగాయలు, ఆకుకూరల ధరలు విపరీతంగా పెంచేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. మెంథా తుఫాన్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన రేట్లతో జనాలకు చుక్కలు కనబడుతున్నాయి. అయితే గతంలో.. 20 రూపాయలు అమ్మిన కూరగాయలు.. ప్రస్తుతం 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యుడు ఏం కొనేటట్లు, తినేటట్లు కనిపించడంలేదు.
Read Also:Shocking Video: : విద్యార్దిని మెట్లపై నుంచి కిందకు తోసేసిన ప్రిన్సిపాల్… వీడియో వైరల్
అయితే కోడి గుడ్ల ధరలు సామాన్యుడికి అందకుండా.. అందలం ఎక్కాయి. కోడి గుడ్ల ధరలు అమాంతం పెంచడంతో ఏకంగా.. డజను గుడ్ల ధర 98 రూపాయలకు చేరుకుంది. దీంతో జనాలు గుడ్లు తినాలన్నా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. గతంలో కిలో చికెన్ 240 నుంచి 260 రూపాయలు ఉంది. కార్తీక మాసం సందర్భంగా.. కిలోకు 20 నుంచి 40 రూపాయల వరకు తగ్గించారు. మాంసం ధరలు తగ్గితే గుడ్డురేటు మాత్రం పెరగడం ఏంటని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం డిమాండ్ కు తగిన సరఫరా లేకపోవడంతో రేట్లు పెరిగాయని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో జనాలు ఏం కోనాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు.
