Soft Mysore Pak Recipe : ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్.. పక్కా కొలతలతో ఇలా చేసుకోండి.!
- ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్
- తీగ పాకమే టేస్ట్‌కు అసలైన సీక్రెట్
- సరైన కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్ టెక్చర్
- నెయ్యి వాసనతో నోట్లో కరిగే స్వీట్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soft Mysore Pak Recipe in Telugu : మైసూర్ పాక్ అనగానే మనకు స్వీట్ షాపుల్లో దొరికే నెయ్యి మైసూర్ పాక్ గుర్తొస్తుంది. అయితే చాలా మందికి ఇంట్లో చేసేటప్పుడు అది గట్టిగా రావడం లేదా టెక్చర్ సరిగ్గా కుదరకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ, సరైన కొలతలతో చేస్తే హోటల్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్‌ను సులభంగా ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఆ పర్ఫెక్ట్ తయారీ విధానం ఇక్కడ ఉంది:
కావలసిన పదార్థాలు:
Also Read
- Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు 'ఆనియన్ పెసరట్టు'.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- శెనగపిండి: 1 కప్పు
- పంచదార: 1 ½ కప్పులు
- ఫ్లేవర్ లెస్ ఆయిల్ (సన్ ఫ్లవర్ ఆయిల్): 1 కప్పు
- నెయ్యి: ½ కప్పు
- నీళ్లు: ¾ కప్పు
తయారీ విధానం:
1. పిండి మిశ్రమాన్ని సిద్ధం చేయడం
ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు శెనగపిండిని తీసుకోవాలి. అందులో ఒక కప్పు నూనె , అర కప్పు నెయ్యి వేసి ఉండలు లేకుండా విస్కర్ లేదా స్పూన్ సహాయంతో సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా పిండిని నూనెలో ముందే కలపడం వల్ల పాకంలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే మైసూర్ పాక్ వేయడానికి ఒక లోతైన గిన్నెకు నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి.
2. పంచదార పాకం తయారీ
స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఒకటిన్నర కప్పుల పంచదార , ముప్పావు కప్పు నీళ్లు పోయాలి. మీడియం ఫ్లేమ్ మీద పంచదారను కలుపుకుంటూ మరిగించాలి. వేళ్లతో చెక్ చేసినప్పుడు ఒక తీగ పాకం (Single string consistency) వచ్చే వరకు దీనిని మరిగించాలి.
3. ఉడికించే విధానం
తీగ పాకం రాగానే, ముందుగా కలిపి పెట్టుకున్న శెనగపిండి మిశ్రమాన్ని అందులో వేయాలి. మిశ్రమం ఉడకడం మొదలైనప్పటి నుండి మంటను పూర్తిగా తగ్గించి (లో ఫ్లేమ్), ఆపకుండా కలుపుతూనే ఉండాలి. మిశ్రమం ఉడుకుతూ పాన్ నుండి వేరుపడుతున్నప్పుడు , పైకి తేలికగా నురగలా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆపాక కూడా ఒక నిమిషం పాటు బాగా కలిపి, నెయ్యి రాసిన గిన్నెలోకి మార్చుకోవాలి.
4. చల్లార్చడం , ముక్కలు చేయడం
దీనిని గది ఉష్ణోగ్రత వద్దే పూర్తిగా చల్లారనివ్వాలి, పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. సుమారు రెండు గంటల తర్వాత మైసూర్ పాక్ సెట్ అవుతుంది. అప్పుడు చాకుతో అంచులను స్క్రాప్ చేసి, ఒక ప్లేట్లోకి తీసుకుని మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ముఖ్యమైన చిట్కాలు
కొలతలు: ఒక కప్పు శెనగపిండికి ఒకటిన్నర కప్పుల నూనె లేదా నెయ్యి మిశ్రమాన్ని వాడితేనే మైసూర్ పాక్ సాఫ్ట్‌గా వస్తుంది.
మంట: శెనగపిండి వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లోనే ఉంచి ఉడికించడం వల్ల టెక్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది.
తాజావార్తలు
-
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
-
Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
-
Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
-
Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!