NTV Telugu Site icon

Health: విటమిన్ ‘సి’ ఎక్కువగా తీసుకుంటున్నారా..? జరిగే అనర్థాలు ఇవే..!

Vitamin C

Vitamin C

మెరిసే చర్మం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు విటమిన్ ‘సి’ ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి.. పెరుగుదల, అభివృద్ధి, శరీర కణజాలం మరమ్మత్తు.. ఇనుము శోషణకు విటమిన్ సి అవసరం. దీని వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగమైనప్పటికీ.. ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కలిగే కొన్ని నష్టాల గురించి తెలుసుకుందాం.

వాంతులు-విరేచనాలు
విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు వస్తాయి.

గుండెలో మంట, తలనొప్పి
విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ రిఫ్లక్స్.. గుండెల్లో మంట సమస్య పెరుగుతుంది. దీని కారణంగా GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి) సమస్య చాలా రోజుల పాటు ఉంటుంది.

చర్మానికి హాని కలుగుతుంది
మెరిసే చర్మాన్ని పొందడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై దద్దులు, దురద వస్తుంది.

కడుపు నొప్పి
విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కడుపు టైట్ అయిపోయి నొప్పి వస్తుంది. శరీరంలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల జీర్ణ ఎంజైమ్‌లను అసమతుల్యత చేయడం ద్వారా కడుపులో నొప్పి సమస్యను పెంచుతుంది.

శరీరంలో ఇనుము పరిమాణం పెరుగుతుంది
విటమిన్ సి శరీరంలో ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో అధిక ఇనుముకు దారితీస్తుంది. ఇది కాలేయం, గుండె, ప్యాంక్రియాస్, థైరాయిడ్.. నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తుంది.

కిడ్నీ సమస్య
విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సలేట్ పరిమాణం పెరుగుతుంది. దాని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలను పెంచుతుంది.

విటమిన్ సి ఎంత అవసరం..?
NIH ప్రకారం.. మహిళలు రోజుకు 75 mg విటమిన్ సి తీసుకోవాలి. పురుషులు రోజుకు 90 mg విటమిన్ సి తీసుకోవాలి. గర్భధారణ సమయంలో రోజుకు 120 mg సిఫార్సు చేయబడింది. దీని కంటే ఎక్కువ విటమిన్ సి తీసుకోవడం వల్ల ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది.