Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bajra Raab Recipe: చలికాలం రాగానే మన ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వస్తుంటాయి. ఈ సీజన్లో రుచిగా ఉండటంతో పాటు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అందుకే చలి రోజుల్లో సజ్జలతో చేసే వంటకాలకు డిమాండ్ పెరుగుతుంది. సజ్జ రొట్టెలు, కిచిడీ, ఉప్మా లాంటివి మీరు చాలాసార్లు తిని ఉంటారు కానీ, ఎప్పుడైనా రాజస్థాన్ ఫేమస్ సజ్జ పిండి రాబ్ (బాజ్రా రాబ్) రుచి చూశారా? ఇది రాజస్థాన్‌కు చెందిన సంప్రదాయ పానీయం, ముఖ్యంగా చలికాలంలో దీన్ని ఎంతో ఇష్టంగా తాగుతారు. సజ్జ పిండి, మజ్జిగ, కొన్ని మసాలాలతో తయారు చేసే ఈ రాబ్ రుచికి కాస్త పుల్లగా, ఘాటుగా ఉంటుంది. దీన్ని వేడివేడిగా తాగే మజాయే వేరు. మరి ఈ చలికాలంలో కొత్తగా, దేశీ స్టైల్లో ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇంట్లోనే సులభంగా సజ్జ పిండి రాబ్ చేసుకోవచ్చు. దీని సింపుల్ రెసిపీ ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
Also Read
- Bengali Aloo Posto Recipe: ఆలూ కూర తిని విసుగొచ్చిందా? బెంగాలీ స్టైల్లో ఆలూ పోస్తో ట్రై చేయండి.. రుచి అదిరిపోతుంది!
- Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!
- Tomato Paratha Recipe: కాస్త పులుపు.. కాస్త కారంగా.. టమాటర్ పరాటా ఇలా చేసేయండి..
- Healthy Winter Recipes: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బలం.. చలికాలంలో తినాల్సిన హెల్తీ లడ్డూను నిమిషాల్లో చేసుకోండి!
సజ్జ పిండి: 1/2 కప్పు
మజ్జిగ: 500 మిల్లీలీటర్లు
నీళ్లు: 1 లీటరు
ఉప్పు: రుచికి తగినంత
జీలకర్ర పొడి: రుచికి తగినంత
కొత్తిమీర: గార్నిష్ చేయడానికి
సజ్జ పిండి రాబ్ ఎలా చేయాలి?
సజ్జ పిండి రాబ్ చేయడానికి ముందుగా ఒక పెద్ద గిన్నెలో సజ్జ పిండి తీసుకోండి. అందులో కొద్దికొద్దిగా మజ్జిగ పోస్తూ బాగా కలపండి. పిండిలో ఉండలు కట్టకుండా జాగ్రత్త పడండి. పిండి, మజ్జిగ బాగా కలిసిన తర్వాత దాన్ని ఒక మట్టి పాత్రలోకి లేదా మందపాటి గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి, హై ఫ్లేమ్ మీద ఆపకుండా కలుపుతూ మరిగించండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మంట తగ్గించి, ఈ మిశ్రమాన్ని సుమారు 20 నిమిషాల పాటు ఉడికించండి. ఈ సమయంలో అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండండి. రాబ్ బాగా ఉడికిన తర్వాత, అందులో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపండి. మసాలాల రుచి బాగా పట్టేలా మరికొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. తయారైన సజ్జ పిండి రాబ్ పైన కొత్తిమీర చల్లి వేడివేడిగా సర్వ్ చేయండి. చలికాలంలో దీన్ని ఉదయం టిఫిన్ టైమ్‌లో గానీ లేదా సాయంత్రం పూట గానీ తాగొచ్చు. రాజస్థాన్ సంప్రదాయ పానీయమైన ఈ రాబ్ రుచికి అద్భుతంగా ఉంటుంది, పైగా దీన్ని చేయడానికి పెద్దగా శ్రమ కూడా ఉండదు.
తాజావార్తలు
-
Bajra Raab Recipe: చలికాలంలో వేడివేడిగా సజ్జ రాబ్ తాగారా? రాజస్థానీ స్టైల్లో ఇలా చేసేయండి!
-
Koti Deepotsavam 2026: నేడు కన్నులపండుగగా జరగనున్న కపాలీశ్వర స్వామి కల్యాణోత్సవం..! గంగాధరుడికి కోటిరుద్రాక్షల అర్చన..
-
Dhruv Jurel Record: కష్టాల్లోనూ గొప్ప పోరాటం.. చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్!
-
Huawei Qingyun C7: Huawei కొత్త టాబ్లెట్ లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
AP Panchayat Elections 2026: ప్రారంభమైన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 1170 సర్పంచ్, 19655 వార్డులు ఏకగ్రీవం!
ట్రెండింగ్
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!