Ragi Ambali: అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. హాట్ హాట్ వేసవిలో శక్తిని ఇచ్చే హెల్తీ, టేస్టీ రాగి అంబలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Ambali Recipe: మన పెద్దలు వందేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం జీవించే వారు. వందేళ్లకు పైబడిన వృద్ధులను మనం చూసే ఉంటాం. వారు అంత స్ట్రాంగ్‌గా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఆహారపు అలవాట్లు ఒకటి. అప్పట్లో రాగులు, సజ్జలు, మినుములు, జొన్నలు ఎక్కువగా తినేవాళ్లు. ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలా అందరి ఇళ్లలో రాగి అంబలి కనిపించేంది. ఉదయాన్నే రాగుల (Finger Millet)తో చేసిన అంబలి తాగి పొలానికి వెళ్లే వాళ్లు. ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సిటీలో రాగులతో అంబలి కాయడం కష్టంగా మారింది. కొందరు వాళ్ల బిజీ లైఫ్ కారణంగా చేసుకోలేకపోతున్నారు. కొందరికి అంబలి తయారు చేసుకుందాం అనిపించిన తయారీ విధానం తెలియక కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ల కోసమే అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్య రసహ్యమైన రాగి అంబలి టేస్టీ, హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
READ MORE: Ranbir Kapoor: రామాయణలో రణబీర్ ‘డబుల్’ ధమాకా.. రాముడితో పాటు ఆ పవర్‌ఫుల్ రోల్‌లోనూ ఆయనే!
Also Read
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. 'పెరి పెరి మసాలా'ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
రాగి అంబలి తయారీకి కావలసిన పదార్థాలు:
రాగి పిండి: 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు: 1.5 కప్పులు (మొదట కలపడానికి అర కప్పు, మరిగించడానికి ఒక కప్పు)
పెరుగు: ½ కప్పు
మజ్జిగ కోసం నీళ్లు: ½ కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
ఉల్లిపాయ ముక్కలు: 2-3 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి)
కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినది)
తాలింపు కోసం:
నూనె: 1 టీస్పూన్
ఆవాలు: ½ టీస్పూన్
పచ్చిమిర్చి: ½ (సన్నగా తరిగినవి)
అల్లం తురుము: 1 టీస్పూన్
కరివేపాకు: ఒక రెమ్మ
రాగి అంబలి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకుని, అందులో అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. మరో గిన్నెలో ఒక కప్పు నీటిని పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని అందులో మెల్లగా పోస్తూ కలుపుతూ ఉండాలి. మంటను తగ్గించి (Low Flame), మిశ్రమం చిక్కబడే వరకు సుమారు 4-5 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక పాత్రలో అర కప్పు పెరుగు, అర కప్పు నీళ్లు పోసి చిలికి వెన్న తీయని పలచటి మజ్జిగను సిద్ధం చేసుకోవాలి. ఉడికించి చల్లార్చిన రాగి జావలో, సిద్ధం చేసుకున్న మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పును వేయాలి. ఎక్కడా గడ్డలు లేకుండా మృదువుగా అయ్యే వరకు బాగా కలపాలి. చిన్న బాణలిలో నూనె వేడి చేసి, అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆపై పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి. తయారు చేసుకున్న తాలింపును, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరను రాగి అంబలిలో వేసి బాగా కలపాలి. టెస్టీ, హెల్తీ రాగి అంబలి రెడీ. వడ్డించే ముందు ఒకసారి బాగా కలిపి గ్లాసుల్లో పోయండి!
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!