Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!

  • సత్తు డ్రింక్‌కు కావాల్సిన పదార్థాలు
  • బాదం – సత్తు పొడి తయారీ చిట్కా
  • ఐదు నిమిషాల్లో ప్రోటీన్ షేక్ రెడీ
  • ఈ డ్రింక్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Sattu Drink

Sattu Drink

Protein Rich Sattu Drink : వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంచడానికి సత్తు డ్రింక్ (Sattu Drink) ఒక అద్భుతమైన హెల్తీ ఆప్షన్. ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ సాంప్రదాయ పానీయం ప్రస్తుతం హెల్త్ కాన్షస్ ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. కేవలం తక్కువ సమయంలో, ఇంట్లోనే లభించే పోషక పదార్ధాలతో ఎంతో రుచికరమైన, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే సత్తు షేక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

  • సత్తు లేదా వేయించిన శనగపిండి: అర కప్పు
  • బాదం పప్పులు: 20
  • పండిన అరటిపండు: 1
  • ఖర్జూరాలు (గింజలు తీసేసినవి): 4
  • కాచి చల్లార్చిన పాలు: రెండున్నర కప్పులు
  • గార్నిషింగ్ కోసం: సన్నగా తరిగిన పిస్తా, బాదం ముక్కలు

తయారీ విధానం:
బాదం , సత్తు పొడి సిద్ధం చేయడం
ఈ డ్రింక్ తయారీ కోసం ముందుగా 20 బాదం పప్పులను నీటిలో కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిపై ఉన్న పొట్టును పూర్తిగా తొలగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన శనగలు (సత్తు పిండి) , పొట్టు తీసిన బాదం పప్పులను వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.

చిన్న చిట్కా: ఈ సత్తు-బాదం పొడిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని, గాలి చొరబడని ఒక పొడి డబ్బాలో (Air-tight Container) నిల్వ చేసుకుంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో ఈ హెల్తీ డ్రింక్ తయారు చేసుకోవచ్చు.

బ్లెండింగ్ ప్రక్రియ
పొడి సిద్ధమైన తర్వాత ఒక పెద్ద బ్లెండర్,  జ్యూస్ జార్ తీసుకుని.. అందులో సన్నగా తరిగిన అరటిపండు ముక్కలు, గింజలు తీసేసిన ఖర్జూర పండ్లు, , మనం ముందుగా సిద్ధం చేసుకున్న సత్తు-బాదం పొడిని వేయాలి. దీనికి మొదట ఒకటిన్నర కప్పుల పాలు పోసి మిక్సీని బాగా బ్లెండ్ చేయాలి. ఆ మిశ్రమం కాస్త చిక్కగా మారిన తర్వాత, డ్రింక్ సరైన స్థిరత్వానికి (కన్సిస్టెన్సీ) రావడానికి మిగిలిన ఒక కప్పు పాలు కూడా పోసి మరోసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

సర్వింగ్ , గార్నిషింగ్
అంతే.. ఎంతో రుచికరమైన ప్రోటీన్ రిచ్ సత్తు డ్రింక్ రెడీ అయిపోయినట్లే. దీన్ని ఒక సర్వింగ్ గ్లాసులోకి తీసుకుని, పైన మరికొన్ని అరటిపండు ముక్కలు, సన్నగా తరిగిన పిస్తా , బాదం పప్పులతో అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.

ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కావాల్సిన నాణ్యమైన ప్రోటీన్ లభించడమే కాకుండా, ఎండల తీవ్రతకు నీరసించిపోయే శరీరానికి తక్షణ శక్తి (Instant Energy) అందుతుంది. బరువు తగ్గాలనుకునే వారు, జిమ్‌కు వెళ్లేవారు దీనిని తమ డైలీ బ్రేక్‌ఫాస్ట్, ఈవెనింగ్ స్నాక్ లాగా హ్యాపీగా తీసుకోవచ్చు.