NTV Telugu Site icon

Health tips: డయాబెటిస్ ని అదుపులో ఉంచే వెల్లుల్లి ఊరగాయ.. తయారీ విధానం

Untitled 2

Untitled 2

Health: ప్రతి రోజు వెల్లుల్లిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి కొలెస్టరాల్ ని నియంత్రిస్తుంది. డైయాబెటిస్ ని అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత జబ్బులను నివారిస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్లకు కూడా వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని.. రుచికి రుచిని అందించే వెల్లుల్లి ఊరగాయకు కావాల్సిన పదార్ధాల గురించి ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో 81 శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులే.. ఎక్కువగా ఈ పార్టీ వారే..

వెల్లుల్లి ఊరగాయకు కావాల్సిన పదార్ధాలు:

వెల్లుల్లి పాయలు- 100 గ్రా, చింతపండు 100 గ్రా, కారం- 4 టేబుల్ స్పూన్ లు, ఉప్పు-2 టేబుల్ స్పూన్ లు , ఆవాలు మెంతుల పొడి- 2 టేబుల్ స్పూనులు, వేరుశనగ నూనె- 100 గ్రా.

తయారీ విధానం: ముందుగా పైన పొక్కు తీసుకున్న వెల్లుల్లి పాయల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కారం, చింతపండు గుజ్జు, ఉప్పు, నూనె, ఆవాలు మెంతుల పొడి వేసి బాగా కలిపి ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. ఒక వారం తరువాత ఇందులో పోపు వేసుకుంటే వెల్లుల్లి ఊరగాయ తాయారు అవుతుంది. ప్రతి రోజు పరగడుపున ఒక ముద్ద అన్నం వెల్లులి ఊరగాయ తో తిని గోరు వెచ్చని నీళ్లు తాగితే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..

Show comments