Multi Millet Masala Khichdi Recipe: రెగ్యులర్‌గా రైస్ అంటే బోర్.. చిరు ధాన్యాలతో మసాలా కిచిడీ ఇలా తయారు చేయండి.. మిగిలితే ఒట్టు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Multi Millet Masala Khichdi Recipe: రోజూ ఒకేలా బియ్యం వంటలు తినడం వల్ల బోర్ అనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉండే ఒక మంచి ప్రత్యామ్నాయం మల్టీ మిల్లెట్ మసాలా కిచిడీ. చిరుధాన్యాలతో తయారయ్యే ఈ వంటకం శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చిరుధాన్యాలు అంటే కొర్రలు, జొన్నలు, సాన్వా (బార్న్యార్డ్ మిల్లెట్), బజ్రా వంటి ధాన్యాలు. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ మల్టీ మిల్లెట్ మసాలా కిచిడీని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
* కావలసిన పదార్థాలు
– ¼ కప్ ఫాక్స్‌టైల్ మిల్లెట్
– ¼ కప్ బజ్రా
– ¼ కప్ జోవర్
– ¼ కప్ సాన్వా (బార్న్యార్డ్ మిల్లెట్)
– ¼ కప్పు మూంగ్ పప్పు
– ¼ కప్పు మసూర్ పప్పు
– ½ కప్పు అర్హార్ పప్పు
– ½ స్పూన్ పసుపు
– రుచికి ఉప్పు
– 7 కప్పుల నీరు
Also Read
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
* టెంపరింగ్ కోసం
– 3 టేబుల్ స్పూన్ల నెయ్యి,
– 2 ఎండు మిరపకాయలు,
– ½ టీస్పూన్ ఇంగువ,
– 2 టీస్పూన్ల ఆవాలు,
– 2 టీస్పూన్ల జీలకర్ర,
– కొన్ని కరివేపాకు ఆకులు,
– ½ కప్పు ఉల్లిపాయ (తరిగినది),
– 2 టీస్పూన్ల అల్లం (తరిగినది),
– 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి
– (తరిగినది), 1 పచ్చి మిరపకాయ (తరిగినది),
– ½ టీస్పూన్ పసుపు
– కారం, రుచికి సరిపడా ఉప్పు,
– 1 కప్పు టమోటా (తరిగినది),
– అవసరమైనంత నీరు
– చిటికెడు కసూరి మెంతి,
– అర నిమ్మకాయ,
– కొద్దిగా కొత్తిమీర ఆకులు
తయారీ విధానం:
ముందుగా అన్ని చిరుధాన్యాలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీరు పోయాలి. తరువాత పెసలు, మసూర్ పప్పు, కంది పప్పు వేసి పసుపు, ఉప్పు కలిపి బాగా ఉడికించాలి. ఇక, మరోవైపు ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి ఎండు మిరపకాయలు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, అల్లం వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం, పసుపు వేసి కలపాలి. టమోటా వేసి మసాలా మెత్తబడే వరకు ఉడికించాలి. ఈ తాలింపును ముందుగా ఉడికించిన మిల్లెట్ కిచిడీలో వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించి, కొద్దిగా నిమ్మరసం పిండితే రుచికరమైన మల్టీ మిల్లెట్ మసాలా కిచిడీ సిద్ధమవుతుంది. ఈ ఆరోగ్యకరమైన వంటకం వేడివేడిగా తింటే రుచి రెట్టింపు అవుతుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపించేంత రుచిగా ఉంటుంది!
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?