Site icon NTV Telugu

Meat Consumption: ప్రతీ ఏడాది 100 బిలియన్ల జంతువుల్ని తింటున్న మనుషులు..

Meet

Meet

Meat Consumption: మాంసాహారం, శాఖాహారం ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది తేలని అంశం. అయితే కొన్ని సందర్భాల్లో శాఖాహార భోజనం బెటర్ అని చెబుతుంటారు. ప్రోటీన్స్ ఎక్కువగా రావాలంటే మాంసం తినాలని సూచిస్తుంటారు. చాలా మంది నాన్ వెజ్ అంటేనే ఇష్టపడుతుంటారు. ఇటీవల కాలంలో మనదేశంలో కూడా మాంసాహారం తీసుకోవడం పెరిగింది. ఇదిలా ఉంటే ది ఎకనామిస్ట్‌లోని పాత రిపోర్టు ఒకటి వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మాంసాహార రిపోర్టును చూస్తే దిమ్మతిరగాల్సిందే. ప్రతీ ఏడాది భూమిపై ఉండే మనుషులు 100 బిలియన్లు(10,000 కోట్ల) జంతువులను తింటున్నారని నివేదిక తెలిపింది.

Read Also: Pakistan: వైవాహిక అత్యాచారం కేసులో పాక్ కోర్టు ఇలాంటి తీర్పు ఇస్తుందని ఊహిస్తామా..?

ది ఎకనామిస్ట్‌లోని పాత నివేదిక ప్రకారం, వ్యవసాయ జంతువులు – కోళ్లు (19 బిలియన్లు), ఆవులు (1.5 బిలియన్లు), గొర్రెలు (1 బిలియన్లు) మరియు పందులు (1 బిలియన్లు) ఏడాదికి తింటున్నారు. మానవులు తినే జంతువుల సంఖ్య భూమిపై ఉన్న మానవులకు కొన్ని రెట్లు అధికంగా ఉంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. అన్ని జంతువుల్లో కోళ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రతీ రోజూ 20.5 కోట్ల కోళ్లను తింటున్నారు. ప్రతీ నిమిషానికి 1,40,000 కంటే ఎక్కువ కోళ్లు వధించబడుతున్నాయి. ప్రతీ ఏడాది 14 బిలియన్ల చేపల్ని, 3 బిలియన్ల రొయ్యల్ని, 2.9 బిలియన్ల బాతుల్ని తింటున్నట్లు వీడియో వెల్లడిస్తుంది. ఇవే కాకుండా ప్రతీ ఏడాది రెండు బిలియన్ల ఆక్టోపస్‌లని, 100 మిలియన్ల సొరచేపల్ని తింటున్నాం. 1.5 బిలియన్ల పందుల్ని వధిస్తున్నాము. గత 50 ఏళ్లలో ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగింది.

ఎక్కువగా మాంసం డిమాండ్ చైనాలో ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఇఎఫ్) తన నివేదికలో తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం వినియోగదారుగా ఉంది. దీనికి విరుద్ధంగా యూరప్, అమెరికాలో వినియోగం స్టేబుల్‌గా ఉంది. జనాభా పరంగా చైనాతో పోటీ పడుతున్న భారత్‌లో మాత్రం మాంసం తక్కువగా వినియోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. రెడ్ మీట్‌లో బీఫ్ గత 50 ఏళ్లలో దాని వాటా సగానికి పడిపోయి 22 శాతానికి చేరుకుందని తెలిపింది. ఇది గొర్రె మాంసం కన్నా 5 రెట్లు ప్రజాదరణ పొందింది.

Exit mobile version