Site icon NTV Telugu

Jowar Bun Dosa Recipe: అప్పటికప్పుడే అదిరిపోయే హెల్తీ, టేస్టీ జొన్న బన్ దోశ.. కొత్తగా ట్రై చేయండి..

Jowar Bun Dosa1

Jowar Bun Dosa1

Jowar Bun Dosa Recipe: టిఫిన్‌లో తరచూ తినే ఐటెమ్స్‌ ఉంటే బోరింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు కాస్త భిన్నంగా ట్రై చేద్దాం. బ్రేక్‌ఫాస్ట్‌లో కొత్తగా, ఆరోగ్యంగా ఏదైనా చేయాలనిపిస్తే జొన్న బన్ దోశ బెస్ట్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఈ అనే వంటకం భారతీయది కాదు. కానీ ప్రస్తుతం ట్రేడింగ్‌గా మారింది. ఈ రెసిపీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ దోశ మృదువుగా ఉంటుంది. ముఖ్యంగా జొన్న పిండి, పెరుగు, కొద్దిగా రవ్వ, కూరగాయలతో ఇది తయారవుతుంది. పులియబెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఉదయం తక్కువ టైమ్‌లో ఈజీగా చేసుకోవచ్చు. పిండి గట్టిగా ఉండటం వల్ల లోపల నెమ్మదిగా ఉడికి, తిన్నాక పొట్ట నిండిన భావన ఇస్తుంది. జొన్నలో ఫైబర్, ఇనుము, ప్రోటీన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది శరీరానికి బలం ఇస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరిపడే అల్పాహారం ఇది.

READ MORE: స్లిమ్ బెజెల్స్‌, టూ-వే స్పీకర్లతో రాబోతున్న Xiaomi X Pro QLED (2026) 75 అంగుళాల టీవీ.. ఫీచర్స్ ఇవే!

జొన్న బన్ దోశ దోశ..
ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో మూడు వంతుల కప్పు జొన్న పిండి, అర కప్పు రవ్వ, మూడు వంతుల కప్పు పెరుగు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందులో అర కప్పు నీళ్లు వేసి ముద్దలు లేకుండా బాగా కలపాలి. మిశ్రమం మృదువుగా ఉండాలి. ఇప్పుడు తురిమిన అర క్యారెట్, సన్నగా తరిగిన అర ఉల్లిపాయ, అర క్యాప్సికం, రెండు స్పూన్లు తరిగిన క్యాబేజీ, రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రెండు స్పూన్లు కొత్తిమీర కలపాలి. అదనంగా అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలపాలి. ఇలా అన్నీ కలిసిన తర్వాత పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి. చివరిగా అర టీ స్పూన్ ఇనో వేసి మెల్లగా కలపాలి. వెంటనే పిండిలో చిన్న చిన్న బుడగలు వస్తాయి. అదే ఈ బన్ దోశను మృదువుగా చేస్తుంది. ఇప్పుడు చిన్న పాన్ లేదా దోశ తవా వేడి చేసి, దానిపై కొద్దిగా నూనె రాయాలి. ఒక గరిటె పిండిని తీసుకుని మధ్యలో పోసి కొంచెం మందంగా పరచాలి. ఎక్కువ పల్చగా కాకుండా చూసుకోవాలి. మూత పెట్టి రెండు నిమిషాలు నెమ్మదిగా కాల్చాలి. కింద భాగం బంగారు రంగులోకి మారిన తర్వాత తిప్పి మరో వైపు కూడా కాల్చాలి. రెండు వైపులా సమంగా ఉడికితే సరిపోతుంది. ఇలా వేడి వేడి జొన్న బన్ దోశ సిద్ధమవుతుంది. దీనిని కొబ్బరి చట్నీ, పెరుగు లేదా టమాటో సాస్‌తో తింటే రుచి మరింత పెరుగుతుంది. ఉదయం తొందరగా చేయడానికి సులభం, ఆరోగ్యంగా ఉండేందుకు మంచిది. వారానికి ఒక్కసారి అయినా ట్రై చేయండి..

READ MORE: TG Municipal Elections Live Updates: నేడే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. మీ అభ్యర్థుల భవితవ్యం ఇక్కడ చూడండి..

Exit mobile version