NTV Telugu Site icon

Kumari Aunty: దేవుడా.. నెలకు రూ. 18 లక్షలా.. కుమారి ఆంటీ.. సాప్ట్ వేర్ లో కూడా ఇంత రాదే..

Kumari

Kumari

Kumari Aunty: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. కుమారి ఆంటీ.. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుమారి ఆంటీ.. నాన్న.. ఏం కావాలి. చికెన్ అయితే 120.. లివర్ అయితే 150 అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఫుడ్ బిజినెస్ చేసే ఒక మహిళ. ఆమెపేరే దాసరి సాయి కుమారి. ప్రపంచంలో బాగా సక్సెస్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే. కుమారి కూడా 2011 లో హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ ఎదురుగా ఆమె తన స్ట్రీట్‌ఫుడ్‌ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. 13 ఏళ్లుగా ఆమె ఇదే బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. 5 కేజీల రైస్ తో మొదలుపెట్టిన ఆమె వ్యాపారం ఇప్పుడు రోజుకు 100 కేజీల రైస్ ను వండి వారుస్తోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగ్స్ ఎంత పెద్ద సక్సెస్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా కొంతమంది యూట్యూబర్స్ .. కుమారి ఆంటీని ప్రజలకు పరిచయం చేశారు. తక్కువ ధరలో క్వాలిటీ ఫుడ్ పెడుతుందని, టేస్ట్ బావుంటుందని చెప్పడంతో ఒక్కొక్కరుగా కుమారి ఆంటీ బండిదగ్గరకు వెళ్లడం.. వీడియోలు తీసి పెట్టడంతో ఆమె ఫేమస్ అయ్యింది. ఆ తరువాత సెలబ్రిటీలు సైతం తమ వ్యూస్ ను పెంచుకోవడానికి ఆమెతో ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. అలా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆదాయం చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా ఫుడ్ బిజినెస్ అంటే.. ఎంత వస్తుంది.. మహా అయితే నెలకు ఒక లక్ష వస్తాయేమో అనుకుంటాం.. కానీ, కుమారి ఆంటీ నెల సంపాదన.. అక్షరాలా రూ. 18 లక్షలు. ఏంటి జోకా.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకే రావడం లేదు అని వెటకారం చేయకండి.. నిజంగా ఆమె రోజుకు రూ. 60 వేలు సంపాదిస్తుంది. నెలకు అక్షరాలా రూ. 18 లక్షలు.. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. నాన్‌ వెజ్‌లో రెండు కర్రీలు తీసుకుంటే ప్లేటు రూ.150, మూడు తీసుకుంటే రూ.200 అలా ఐటెమ్‌ను బట్టి రేటు ఉంటుంది. రోజుకు 700 వందల మంది తమ దగ్గర ఫుడ్ తింటారని, 600 వందల మంది కస్టమర్స్‌కు యావరేజ్ 100 రూపాయలు లెక్కన వేసుకున్నా.. రోజుకు రూ.60,000 వస్తాయని తెలిపింది. ఇక పెట్టుబడికి మినిమమ్ లో మినిమమ్ రూ. 10 నుంచి రూ. 12 లక్షలు పోయినా.. రూ. 6 లక్షలు లాభం అన్నమాట. అంటే ఈ లెక్కన కుమారి ఆంటీ నెల సంపాదనతో ఒక చిన్నపాటి సినిమా కూడా తీసేయొచ్చు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంత చదువు చదివి రూ.20 -30 వేలకు పనిచేయడం కన్నా.. ఆమెలాగా ఫుడ్‌కోర్టు పెట్టుకుంటే లైఫ్‌లో సెటిల్‌ అవ్వవచ్చని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు.

ఇక ఈ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 3 గంటలకు క్లోజ్ అవుతుంది. వెజ్ లో వైట్‌ రైస్‌, బగారా రైస్‌, గోంగూర రైస్‌, టమాటా రైస్‌, లెమన్‌ రైస్‌, జీరా రైస్‌ గోబీ రైస్‌, పెరుగన్నం వంటి ఐటెమ్స్‌ సర్వ్ చేస్తుంది. నాన్‌వెజ్‌లో చికెన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, లివర్‌ కర్రీ, బోటీ కర్రీ, మటన్‌ లివర్‌, మటన్‌ హెడ్‌, మటన్‌ కర్రీ, ఫిష్‌ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్‌ కర్రీ ఉంటాయి. ఇక ప్రస్తుతం కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్లినా.. చాలామంది ఆమెతో ఫోటోలు దిగుతున్నారు. మరి మీరు కూడా ఆమె వంట టేస్ట్ చేయాలంటే.. డబ్బులు ఎక్కువ పెట్టుకొని వెళ్లి రండమ్మా.. రెండు లివర్స్.. రూ.1000 అంటే కష్టం కదా.