Kumari Aunty: దేవుడా.. నెలకు రూ. 18 లక్షలా.. కుమారి ఆంటీ.. సాప్ట్ వేర్ లో కూడా ఇంత రాదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kumari Aunty: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. కుమారి ఆంటీ.. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుమారి ఆంటీ.. నాన్న.. ఏం కావాలి. చికెన్ అయితే 120.. లివర్ అయితే 150 అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఫుడ్ బిజినెస్ చేసే ఒక మహిళ. ఆమెపేరే దాసరి సాయి కుమారి. ప్రపంచంలో బాగా సక్సెస్ అయ్యే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే. కుమారి కూడా 2011 లో హైదరాబాద్ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె తన స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది. 13 ఏళ్లుగా ఆమె ఇదే బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. 5 కేజీల రైస్ తో మొదలుపెట్టిన ఆమె వ్యాపారం ఇప్పుడు రోజుకు 100 కేజీల రైస్ ను వండి వారుస్తోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగ్స్ ఎంత పెద్ద సక్సెస్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా కొంతమంది యూట్యూబర్స్ .. కుమారి ఆంటీని ప్రజలకు పరిచయం చేశారు. తక్కువ ధరలో క్వాలిటీ ఫుడ్ పెడుతుందని, టేస్ట్ బావుంటుందని చెప్పడంతో ఒక్కొక్కరుగా కుమారి ఆంటీ బండిదగ్గరకు వెళ్లడం.. వీడియోలు తీసి పెట్టడంతో ఆమె ఫేమస్ అయ్యింది. ఆ తరువాత సెలబ్రిటీలు సైతం తమ వ్యూస్ ను పెంచుకోవడానికి ఆమెతో ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. అలా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఆదాయం చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా ఫుడ్ బిజినెస్ అంటే.. ఎంత వస్తుంది.. మహా అయితే నెలకు ఒక లక్ష వస్తాయేమో అనుకుంటాం.. కానీ, కుమారి ఆంటీ నెల సంపాదన.. అక్షరాలా రూ. 18 లక్షలు. ఏంటి జోకా.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకే రావడం లేదు అని వెటకారం చేయకండి.. నిజంగా ఆమె రోజుకు రూ. 60 వేలు సంపాదిస్తుంది. నెలకు అక్షరాలా రూ. 18 లక్షలు.. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. నాన్ వెజ్‌లో రెండు కర్రీలు తీసుకుంటే ప్లేటు రూ.150, మూడు తీసుకుంటే రూ.200 అలా ఐటెమ్‌ను బట్టి రేటు ఉంటుంది. రోజుకు 700 వందల మంది తమ దగ్గర ఫుడ్ తింటారని, 600 వందల మంది కస్టమర్స్‌కు యావరేజ్ 100 రూపాయలు లెక్కన వేసుకున్నా.. రోజుకు రూ.60,000 వస్తాయని తెలిపింది. ఇక పెట్టుబడికి మినిమమ్ లో మినిమమ్ రూ. 10 నుంచి రూ. 12 లక్షలు పోయినా.. రూ. 6 లక్షలు లాభం అన్నమాట. అంటే ఈ లెక్కన కుమారి ఆంటీ నెల సంపాదనతో ఒక చిన్నపాటి సినిమా కూడా తీసేయొచ్చు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంత చదువు చదివి రూ.20 -30 వేలకు పనిచేయడం కన్నా.. ఆమెలాగా ఫుడ్‌కోర్టు పెట్టుకుంటే లైఫ్‌లో సెటిల్ అవ్వవచ్చని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు.
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ఇక ఈ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 3 గంటలకు క్లోజ్ అవుతుంది. వెజ్ లో వైట్ రైస్, బగారా రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్ గోబీ రైస్, పెరుగన్నం వంటి ఐటెమ్స్ సర్వ్ చేస్తుంది. నాన్‌వెజ్‌లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ ఉంటాయి. ఇక ప్రస్తుతం కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్లినా.. చాలామంది ఆమెతో ఫోటోలు దిగుతున్నారు. మరి మీరు కూడా ఆమె వంట టేస్ట్ చేయాలంటే.. డబ్బులు ఎక్కువ పెట్టుకొని వెళ్లి రండమ్మా.. రెండు లివర్స్.. రూ.1000 అంటే కష్టం కదా.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!