Jowar Laddu Recipe: పిల్లలకు శక్తినిచ్చే ఆరోగ్యకరమైన ‘జొన్న లడ్డూలు’.. ఇంట్లోనే చిటికెలో చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Jowar Laddu Recipe: స్వీట్లలో లడ్డూలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ.. బయట తయారు చేసే పలు రకాల లడ్డూలు తినడం అంత మంచిది కాదు. దుకాణాల్లో విక్రయించే లడ్డూల్లో ఏ పిండి వాడుతారు? ఏ నూనే వాడుతారో అనే సందేహం వస్తుంది. అందుకే వాటిని పూర్తిగా ఆస్వాదించలేము. అందుకే ఇప్పుడు మనం ఇంట్లోనే జొన్న పిండితో తయారు చేసే జొన్న లడ్డూ గురించి తెలుసుకుందాం.. ఈ లడ్డూ ఎంత రుచిగా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. జొన్నపిండి, గోధుమపిండి, నెయ్యి, కొబ్బరి పొడి, బాదం వంటి పోషకమైన పదార్థాలతో తయారయ్యే ఈ లడ్డూ తీపి తినాలనే కోరికను తీర్చడంతో పాటు శరీరానికి శక్తిని సైతం అందిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే స్వీట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. జొన్నలో అధికంగా ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, ఎక్కువసేపు తృప్తిగా ఉండేలా చేస్తుంది. బరువు నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుంది. జొన్నలో ఐరన్, మ్యాగ్నీషియం, బీ విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఐరన్ రక్తహీనతను నివారించడంలో ఉపయోగపడుతుంది. మ్యాగ్నీషియం కండరాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. బీ విటమిన్లు శక్తి ఉత్పత్తికి తోడ్పడతాయి. ఈ జొన్న లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
Also Read
- Bellam Rava Laddu: నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! 10 నిమిషాల్లో హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు’.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేయొచ్చు!
- Ginger Chutney: కొలతలతో నిల్వ ఉండే టిఫిన్ సెంటర్ అల్లం చట్నీ.. సింపుల్‌గా ఇలా చేసేయండి!
- Potato Uttapam Recipe: బ్రేక్‌ఫాస్ట్‌లో కొత్త రుచి కావాలా? ఈ ఆలూ ఉత్తప్పం బెస్ట్.. 15 నిమిషాల్లో రెడీ..
- Cow Milk: ఏడాది నిండకముందే పిల్లలకు ఆవు పాలు ఇస్తున్నారా? ఎయిమ్స్ వైద్యుడి హెచ్చరిక
కావాల్సిన పదార్థాలు (7 లడ్డూలకు):
నెయ్యి – అర కప్పు
జొన్న పిండి – అర కప్పు
గోధుమపిండి – అర కప్పు
కొబ్బరి పొడి – అర కప్పు
ముక్కలుగా కట్ చేసిన బాదం – పావు కప్పు
బ్రౌన్ షుగర్ – అర కప్పు
తయారీ విధానం:
మొదట తక్కువ మంటపై ఒక పాన్ వేడి చేసి అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జొన్నపిండి, గోధుమపిండి వేసి నిరంతరం కలుపుతూ సుమారు 5 నిమిషాలు వేయించాలి. పిండులు బాగా కలిసిపోతూ మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. తర్వాత కొబ్బరి పొడి వేసి మరో 2 నిమిషాలు తక్కువ మంటపై కలుపుతూ వేయించాలి. మిశ్రమం నుంచి నెయ్యి విడివడటం ప్రారంభమైతే సరిపోతుంది. అప్పుడు స్టౌ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. వేడి కొంచెం తగ్గాక బాదం ముక్కలు, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలపాలి. మిశ్రమం ఇంకా ఇదే వేడిలో ఉన్నప్పుడే చిన్న చిన్న ముద్దలు తీసుకుని లడ్డూలుగా చేసుకోవాలి. కావాలంటే పై భాగంలో బాదం లేదా జీడిపప్పుతో అలంకరించవచ్చు. లడ్డూలు పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ చేసుకుంటే బెస్ట్.. ఇవి చాలా టేస్టీగా, ఆరోగ్యకరంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్‌లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!