Health: వర్షం పడితే పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది అన్నట్టు కాలం మారేకొంది మనిషి జీవన శైలి కూడా మారుతుంది. రాతి యుగం మనిషికి నేటి యుగం మనిషికి ఎంతో వ్యత్యాసం ఉంది. నాటి మనిషి రాళ్లు తిని కూడా అరాయించుకున్నాడు అంటారు మన పెద్దలు. రాతి యుగం వరకు ఎందుకు రాగి సంగటి, జొన్న, సజ్జ ల సంగటి తిన్న మన తాత ముత్తాతలు కూడా 100 ఏళ్ళ పైనే జీవించారు. కానీ మనం అలా లేము. మనకి అంత వ్యాధి నిరోధక శక్తి కూడా లేదు. అందుకే అనేక వ్యాధులు మనల్ని పట్టి పీడిస్తున్నాయి.
Read also:US White House: వైట్‌హౌస్‌లో ఆంధ్రా విద్యార్థులు సందడి.. కారణం ఇదీ..
అలా మనిషిని ఇబ్బందిపెట్టే ప్రాణంతాకమైన జ్వరాలల్లో డెంగ్యూ జ్వరం ఒకటి. ఈ వ్యాధిలో రక్తకణాలు తగ్గడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే బయట నుండి రక్తకాణాలను ఎక్కించిన.. కొన్ని సందర్భాలలో వ్యక్తి మరణిస్తారు. అయితే చికిత్స చేయించుకుంటూ ఇంటి చిట్కాలు పాటిస్తే డెంగ్యూ జ్వరం నుండి త్వరగా కోలుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఈ జ్వరంలో ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గుతుంది. బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. అలానే కివి పండ్లను తిన్న లేదా కివి పండ్లను జ్యూస్ చేసుకుని తాగిన కూడా ఈ జ్వరం నుండి త్వరగా కోలుకోవచ్చు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.