Oats Roti Recipe: గోధుమ రోటీ బోర్ కొట్టిందా..? ఓట్స్ రోటీ ట్రై చేయండి.. ఆరోగ్యానికి మేలు, రుచిలోనూ సూపర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oats Roti Recipe: ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గోధుమ పిండి లేదా మైదా పదార్థాలకు బదులుగా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకుంటున్నారు. అలాంటి వాటిలో ఓట్స్ ప్రముఖ స్థానం దక్కించుకున్నాయి. సాధారణంగా ఓట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. అయితే ఓట్స్‌తో రుచికరమైన రోటీలను కూడా తయారు చేసుకోవచ్చు.
ఓట్స్‌లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడేవారికి కూడా ఓట్స్ మంచి ఎంపికగా పరిగణిస్తారు. అందుకే రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గోధుమ రోటీలకు ప్రత్యామ్నాయంగా ఓట్స్ రోటీని తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ రోటీ గ్లూటెన్ రహితంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన పోషకాలను అందిస్తుంది. ఇంట్లోనే కొద్ది పదార్థాలతో మెత్తగా, రుచికరంగా తయారు చేసుకోవచ్చు.
Also Read
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ఓట్స్ రోటీకి కావలసిన పదార్థాలు
* 1 కప్పు ఓట్స్ పిండి
* 1 కప్పు నీరు
* 1 టీస్పూన్ నెయ్యి
* 1/4 టీస్పూన్ ఉప్పు
తయారీ విధానం
ముందుగా ఓట్స్‌ను మిక్సర్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత జల్లెడతో జల్లించి మెత్తటి పిండిని వేరుచేయాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఒక కప్పు నీటిని మరిగించాలి. నీరు మరిగిన తర్వాత అందులో నెయ్యి, ఉప్పు వేసి కలపాలి. అనంతరం ఓట్స్ పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మూతపెట్టి సుమారు 10 నిమిషాలు పక్కన ఉంచాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని మెత్తటి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఓట్స్ పిండి రోటీలు ఒత్తేటప్పుడు విరిగే అవకాశం ఉన్నందున బటర్ పేపర్ ఉపయోగించడం మంచిది. బటర్ పేపర్‌పై కొద్దిగా పొడి పిండి చల్లి, పిండి ముద్దను ఉంచాలి. దానిపై మరో బటర్ పేపర్ ఉంచి నెమ్మదిగా ఒత్తి రోటీ ఆకారంలోకి తీసుకురావాలి. ఇప్పుడు పెనాన్ని వేడి చేసి రోటీని జాగ్రత్తగా దానిపై వేయాలి. రెండు వైపులా తిప్పుతూ మధ్యస్థ మంటపై బాగా కాల్చాలి.
వడ్డించే విధానం
మెత్తగా, రుచికరంగా తయారైన ఓట్స్ రోటీని వేడివేడిగా కూరలు, పప్పులు లేదా పెరుగుతో వడ్డించవచ్చు. ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి భోజనంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనుకునే వారు గోధుమ రోటీలకు బదులుగా అప్పుడప్పుడూ ఓట్స్ రోటీని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
తాజావార్తలు
-
Highest Successful Run Chases: వన్డేల్లో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌లు ఇవే.. భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే.!
-
Tibet Earthquake: 7 తీవ్రతతో టిబెట్‌లో భూకంపం.. 16 మంది మృతి, 32 మందికి గాయాలు
-
ICICI Bank Accounts: ఐసీఐసీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్లపై కొత్త ఛార్జీలు..
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
ట్రెండింగ్
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!