Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Healthy Coconut Jaggery Laddu Benefits Simple Recipe

Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!

Published Date :April 3, 2026 , 10:34 am
By Shiva Ganesh
Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kobbari Undalu: సాంప్రదాయ పిండి వంటల్లో కొబ్బరి ఉండలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా చిన్నతనంలో బడ్డీ కొట్ల వద్ద కొనుక్కుని తిన్న ఆ స్వీట్ మ్యాజిక్ ఇప్పటికి గుర్తుందంటే అతిశయోక్తి కాదు. అయితే చాలామంది పాకం పట్టడం కష్టమని వీటిని ఇంట్లో చేయడానికి వెనకాడుతుంటారు. అలాంటి వారి కోసం ఎటువంటి పాకం అవసరం లేకుండా, కేవలం కొబ్బరి, బెల్లంతోనే అచ్చం పాతకాలపు రుచితో కొబ్బరి లడ్డూలను సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు

కావలసిన పదార్థాలు:

పచ్చి కొబ్బరి తురుము: 4 కప్పులు

తురిమిన బెల్లం: 3 కప్పులు

యాలకల పొడి (ఐచ్ఛికం): తగినంత

తయారీ విధానం:
ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి తురిమినట్లుగా వస్తుంది. ఒక గిన్నెను కొలతగా తీసుకుని, 4 కప్పుల కొబ్బరి తురుముకు 3 కప్పుల బెల్లం తురుమును తీసుకోవాలి. తర్వాత ఒక మందపాటి పాన్‌లో కొబ్బరి తురుము, బెల్లం వేసి స్టవ్ మీద పెట్టాలి. మొదట మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి, బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌కు అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు మిశ్రమం దగ్గరపడుతున్నప్పుడు అడుగు అంటకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. సుమారు అరగంట సమయం తర్వాత మిశ్రమం పాన్ నుంచి వేరవుతున్నప్పుడు, కొద్దిగా తీసుకుని ఉండ చుట్టి చూడాలి. చేతికి అంటకుండా ఉండ తయారైతే పదును వచ్చినట్లే. తర్వాత స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి రాసుకోకపోయినా పర్వాలేదు (కొబ్బరిలోని నూనె సరిపోతుంది), చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఈ కొబ్బరి ఉండలు తయారు చేసుకోవడానికి ఎలాంటి నెయ్యి లేదా ఇతర పదార్థాలు వాడనక్కర్లేదు. మీకు కావాలంటే ఫ్లేవర్ కోసం యాలకల పొడి వేసుకోవచ్చు, కానీ స్వచ్ఛమైన కొబ్బరి రుచి కావాలనుకుంటే కేవలం పైన చెప్పిన పద్ధతిని ఫాలో అయితే మంచింది.

ప్రయోజనాలు ఇవే..
కొబ్బరి, బెల్లం కలిపి తీసుకునే ఈ కొబ్బరి ఉండలు కేవలం రుచికరమైన స్వీట్ మాత్రమే కాదు, ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం వీటి వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే.. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, బెల్లంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయన్నారు. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక కొబ్బరి ఉండను తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇది ముఖ్యంగా మహిళలకు, ఎదిగే పిల్లలకు ఎంతో మేలు చేస్తుందన్నారు.

కొబ్బరిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. బెల్లం సహజంగానే జీర్ణ ఎంజైములను ప్రేరేపించి ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. వీటిలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను బలంగా ఉంచుతాయన్నారు. చిన్న పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, పెద్దవారిలో కీళ్ల నొప్పులు తగ్గడానికి ఇవి విశేషంగా సహాయపడతాయని వివరించారు. కొబ్బరిలోని ‘లారిక్ యాసిడ్’ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందని చెప్పారు. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడతాయని పేర్కొన్నారు.

READ ALSO: Gold Price Drop: బంగారం కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. పాతాళానికి పడిపోయిన రేట్లు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Coconut Jaggery Laddu benefits
  • Easy coconut laddu
  • Easy coconut laddu without pakam
  • Health benefits of coconut and jaggery
  • Healthy snacks for kids growth

తాజావార్తలు

  • Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు

  • Jr NTR : ఎన్టీఆర్‌ను ఢీ కొట్టేదెవరు?

  • Ishan Kishan: నేను హ్యాపీగా లేను.. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions