ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా విస్తృతి కారణంగా ఆరోగ్యం విషయంలో అపోహలకు గురవుతున్నారు జనం. మిడిమిడి అవగాహనతో ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. ఆరోగ్యం విసయంలో అపోహలకు దూరంగా వుండాలి. వాస్తవాలు తెలుసుకుని వాటిని ఆచరించడం ఎంతో ఉత్తమం.
అదేపనిగా కూర్చోవడం.. ధూమపానంతో సమానమా?
అవునంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈమధ్యకాలంలో అదేపనిగా కూర్చుని విధులు నిర్వహిస్తున్నారు. తాజా అధ్యయనం ప్రకారం అదేపనిగా కూర్చుని కదలకుండా పనిచేయడం ధూమపానంతో సమానం అంటున్నారు. కూర్చోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కూర్చోవడం కొత్తరకం ధూమపానం అనేది కొత్తగా వినిపిస్తున్న మాట. రెండేళ్ళ క్రితం జరిగిన అధ్యయనం ప్రకారం రోజుకి ఆరు గంటల కంటే ఎక్కువ కూర్చున్న వ్యక్తులు రోజుకు మూడు గంటల కంటే తక్కువగా కూర్చున్న వారి కంటే ముందుగానే చనిపోతారని సర్వేలో తేలింది. మీరు కూర్చున్నప్పుడు మీరు చేసే పనుల మధ్య వ్యత్యాసాలను గుర్తించాలి. మీరు రోజంతా కార్యాలయంలో కూర్చోవడం కొంచెం గట్టిగా అనిపిస్తే, కదిలేందుకు ఇక్కడ కొన్ని మార్గాలు ఉంటాయి. అదేపనిగా కూర్చోకుండా మధ్య మధ్యన లేవడం, అటూ ఇటూ తిరగడం ఎంతో అవసరం.
Read Also: Chiru-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలసి నటించాల్సిందే!
చాక్లెట్లు మొటిమలకు కారణం అవుతాయా?
ఎంతమాత్రంకాదని అధ్యయనంలో తేలింది. చాక్లెట్లు పిల్లలపై ప్రభావం చూపాయి కానీ మొటిమలకు కారణం అవుతుందని నిర్దారించలేమని నిపుణులు తెలిపారు. మరికొందరు చాక్లెట్ మరియు మొటిమల మధ్య సంబంధాన్ని కొట్టిపారేశారు. అయితే 2012లో 44 మంది యువకుల మూడు రోజుల ఆహార డైరీని పరిశీలించారు. చాక్లెట్ మరియు మొటిమల మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలింది. మగ, ఆడ అనే బేధాలు ఏమి లేకుండా అందరూ ఎదుర్కొనే ఒక సాధారణమైన సమస్య ఈ మొటిమలు. ఇది అందరికీ సంభవించే ఒక చర్మ సంబంధమైన సమస్య,
ప్రతి వ్యక్తి జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా మొటిమల వల్ల ఇబ్బందిపడతారు. చర్మంపై పగుళ్లు మొటిమలు అనేవి హఠాత్తుగా ఎదురయ్యేవి కావు, అయినప్పటికీ ఇవి చాలా సమయాల్లో చర్మంపై అకస్మాత్తుగా కనిపిస్తాయి. సాధారణంగా ఇవి ఒత్తిడి, హార్మోన్లలో అసమతుల్యత, తీసుకొనే ఆహార పదార్థాల వల్ల కూడా సంభవించవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. ఒకవేళ మీరు తీసుకునే చాక్లెట్లలో మీ చర్మానికి పడని పదార్ధాలు ఉంటే మాత్రం అవి ముఖంపై జిడ్డుని ప్రేరేపిస్తాయి. మొటిమలు రావడానికి కారణం అవుతాయి. మనము సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా ఈ మొటిమలు ఏర్పడవచ్చు.చాక్లెట్లలో ఉండే అధిక కొవ్వు, చక్కెరలు తరచూ మీ శరీరంపై మంటను కలిగించే సెబమ్ తైలాన్ని అధికంగా ఉత్పత్తిచేసేదిగా దారితీస్తుంది. చాక్లెట్లు తినడం మీరు తగ్గించుకోలేకపొతే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కలిగి ఉన్న డార్క్ చాక్లెట్లు తినవచ్చు.
పెరుగు ఆరోగ్యవంతమైన ఆహారం
పెరుగుని ఆరోగ్యవంతమైన ఆహారంగా అనేకమంది గుర్తిస్తారు. ఖచ్చితంగా, కొన్ని పెరుగు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది, ఇవి సానుకూల ఆరోగ్య ప్రయోజనాలను సృష్టించగలదు. ఎక్కువ చక్కెర, అధిక-ఫ్రూక్టోజ్ కార్న్ సిరప్‌తో నిండి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం, ఇది శరీరాన్ని తేలిక పరచగలదు. పెరుగులో కాల్షియం భాస్వరం, ప్రోటీన్, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి. పెరుగు, ఎండుద్రాక్ష కలిపి తింటే శరీరానికి ఇ, ఎ, సి, బీ 2, బీ12 విటమిన్లతోపాటు కెరోటోనాయిడ్స్ అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Read Also:Mary Kom in WFI: మేరీ కోమ్ కమిటీకి రెజ్లింగ్ ఫెడరేషన్ బాధ్యతలు
<p style=”font-size: 10px;”><span style=”color: red;”>నోట్ :</span> ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p>