బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రొటీన్ మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాదంపప్పు అత్యంత ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌గా పరిగణిస్తారు. దీనిని సాధారణంగా స్వీట్లు, డెజర్ట్‌లలో ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. పచ్చి బాదం, కాల్చిన లేదా నీళ్లలో నానబెట్టుకుని తినవచ్చు. బాదంపప్పును ఇలా తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి.. అది సరైన సమయంలోనే తినాలి.
బాదం పప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు-
గుండె జబ్బుల నివారణ:
బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెకు ఆరోగ్యకరం. క్రమం తప్పకుండ తినడం వలన చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రధానంగా గుండె జబ్బులకు పోషక ఆహారంగా ఉపయోగపడుతుంది.
బరువు తగ్గడం:
బాదంపప్పులో అధిక మొత్తంలో ఫైబర్, ప్రొటీన్లు ఉంటాయి. ఇది తింటే చాలా సమయం పాటు ఆకలి వేయకుండా ఉంచుతుంది. అంతేకాకుండా.. శరీర బరువు తగ్గిస్తుంది.
చర్మానికి ప్రయోజనకరమైనది:
బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ.. ఇతర పోషకాలు మెరిసే చర్మానికి సహాయపడతాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి. బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుంది.
జ్ఞాపకశక్తి బూస్టర్:
బాదం మెదడుకు ఆహారంగా పరిగణించబడుతుంది. వీటిలో ఉండే రిబోఫ్లేవిన్ మరియు ఎల్-కార్నిటైన్ మెదడు అభివృద్ధి, పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. బాదంపప్పు జ్ఞాపకశక్తి, మానసిక చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది.
బలహీనత దూరమవుతుంది:
బాదంపప్పులో జింక్, మెగ్నీషియం, విటమిన్ బి2 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. వ్యాయామం తర్వాత లేదా ఎక్కువసేపు పనిచేసేటప్పుడు బాదంపప్పును తీసుకోవడం వల్ల శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది.
బాదం తినడానికి సరైన సమయం
బాదం పప్పు తినడానికి ఉదయాన్నే ఉత్తమ సమయంగా భావిస్తారు. ప్రతిరోజూ ఉదయం నీరు త్రాగిన తర్వాత, 3-4 బాదంపప్పులను నీటిలో లేదా పాలలో నానబెట్టి ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరంలోని అన్ని పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.