Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
- పిల్లల కోసం ప్రోటీన్ పుష్కలంగా ఉన్న హెల్దీ లడ్డు
- సులభమైన పదార్థాలతో 20 నిమిషాల్లో తయారీ
- బెల్లంతో సహజమైన తీపి.. పోషకాల భాండారం
- నెల రోజుల పాటు నిల్వ ఉండే రుచికరమైన స్నాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Green Moong Dal Laddu: స్కూల్ నుండి అలసిపోయి వచ్చే పిల్లలకు శక్తినిచ్చే , వారి ఎదుగుదలకు తోడ్పడే స్నాక్స్ ఇవ్వడం తల్లిదండ్రుల బాధ్యత. బయట దొరికే జంక్ ఫుడ్, నూనెలో వేయించిన చిప్స్ కంటే ఇంట్లోనే ఎంతో శుభ్రంగా, పౌష్టిక విలువలతో తయారు చేసే ‘పెసరపప్పు బెల్లం లడ్డు’ (Green Moong Dal Laddu) ఒక అద్భుతమైన ఎంపిక. కేవలం 20 నిమిషాల్లో తయారయ్యే ఈ లడ్డూల తయారీ విధానం , అందులోని పోషకాల గురించి వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
Also Read
- How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
- Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
- Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు 'ఆనియన్ పెసరట్టు'.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- పెసర్లు: ఒక కప్పు
- బెల్లం: అర కప్పు నుండి ఒక కప్పు వరకు (మీ తీపికి తగినట్టుగా)
- నెయ్యి: పిండి వేయించడానికి , రుచికి సరిపడా
- యాలకుల పొడి: ఒక టేబుల్ స్పూన్
- డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, కిస్మిస్ వంటివి.
తయారీ విధానం (స్టెప్ బై స్టెప్)
1. పెసర్లను శుద్ధి చేయడం , వేయించడం:
ముందుగా ఒక కప్పు పెసర్లను తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. నీటిని వడకట్టి, పెసర్లను ఒక వెడల్పాటి కడాయిలో వేసి హై ఫ్లేమ్‌లో వేయించాలి. పెసర్లలోని తడి మొత్తం పోయి పొడిపొడిగా అయిన తర్వాత, మంటను తగ్గించి లో ఫ్లేమ్‌లో మంచి రంగు, సువాసన వచ్చే వరకు సుమారు 10 నిమిషాలు వేయించాలి. ఇలా వేయించడం వల్ల లడ్డూలు మంచి రుచిని ఇస్తాయి.
2. బెల్లం సిరప్ సిద్ధం చేయడం:
మరోవైపు ఒక గిన్నెలో అర కప్పు బెల్లం తీసుకుని, అది కరగడానికి సరిపడా కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచాలి. దీనికి తీగ పాకం వంటివి ఏమీ అవసరం లేదు. బెల్లం కరిగి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఆ బెల్లం నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
3. పెసర పిండి గ్రైండింగ్:
వేయించిన పెసర్లు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. పిండి బరకగా లేకుండా చూసుకోవడం ముఖ్యం, అప్పుడే లడ్డులు నోట్లో వేసుకోగానే మెత్తగా కరుగుతాయి.
4. నెయ్యితో వేయింపు:
పాన్ వేడి చేసి అందులో నెయ్యి వేయాలి. ముందుగా బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌ను వేయించి పక్కన తీసుకోవాలి. అదే నెయ్యిలో గ్రైండ్ చేసిన పెసర పిండిని వేసి లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ వేయించాలి. పిండికి నెయ్యి అంతా పట్టి మంచి సువాసన వచ్చే వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలి. ఒకవేళ పిండి మరీ పొడిగా అనిపిస్తే మరికొంచెం నెయ్యిని జోడించవచ్చు.
5. లడ్డూల తయారీ:
పిండి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, అందులో యాలకుల పొడి , వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు, మనం ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం నీటిని కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. పిండి మొత్తం లడ్డులు చుట్టే విధంగా దగ్గరపడినప్పుడు, చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఒకవేళ చివర్లో పిండి ఆరిపోయి లడ్డులు రాకపోతే, రెండు స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కలిపి లడ్డులు చుట్టుకోవచ్చు.
ఈ లడ్డూల ప్రత్యేకత:
- నిల్వ: ఈ లడ్డూలను ఒకసారి చేసి పెట్టుకుంటే దాదాపు నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి.
- ప్రోటీన్: పెసర్లలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది, ఇది పిల్లల శారీరక ఎదుగుదలకు చాలా అవసరం.
- ఆరోగ్యం: ఇందులో పంచదారకు బదులు బెల్లం వాడటం వల్ల ఐరన్ అందుతుంది , జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.
- సాయంత్రం వేళ పిల్లలకు ఇచ్చే ఆరోగ్యకరమైన స్నాక్స్ కోసం ఈ ‘పెసరపప్పు లడ్డు’ ఒక బెస్ట్ ఆప్షన్. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి చూడండి..
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!