Gongura Mutton: గోంగూర మటన్ ఈసారి ఇలా చేయండి.. ఒక్క ముక్క మిగిలితే ఒట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gongura Mutton: మటన్ ప్రియులకు గోంగూర కాంబినేషన్ అంటేనే ఒక ఎమోషన్. పుల్లపుల్లగా, ఘాటుగా ఉండే ఈ కర్రీని అన్నంలో కలుపుకుని తింటుంటే వచ్చే తృప్తే వేరు. మటన్ స్మెల్ అనేది అస్సలు లేకుండా, ముక్క మెత్తగా దూదిలా ఉడికేలా చేసే ఈ స్పెషల్ ‘గోంగూర మటన్’ను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Umbilical Cord: బొడ్డు తాడు పారేస్తున్నారా? ప్రాణాంతక వ్యాధులను నయం చేసే ‘మెడికల్ మిరాకిల్’ ఇదే!
Also Read
- Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
- Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
కావలసిన పదార్థాలు:
మటన్: అర కేజీ (చిన్న ముక్కలు)
గోంగూర: 4 చిన్న కట్టలు (సుమారు 150 గ్రాములు)
మారినేషన్ కోసం: పసుపు (1/2 స్పూన్), ఉప్పు (1 స్పూన్), నిమ్మరసం (1 స్పూన్), నూనె (1 స్పూన్).
మసాలా పొడి కోసం: ధనియాలు (1 టేబుల్ స్పూన్), జీలకర్ర (1 స్పూన్), మిరియాలు (1 స్పూన్), గసగసాలు (1 స్పూన్), ఎండు కొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు.
ఇతరాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నూనె, కరివేపాకు, కొత్తిమీర.
తయారీ విధానం:
ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లోకి తీసుకోండి. అందులో పసుపు, ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి అరగంట నుంచి గంట సేపు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల మటన్ స్మెల్ రాకుండా, ముక్క మెత్తగా ఉడుకుతుంది. తర్వాత మిక్సీ జార్‌లో పైన చెప్పిన మసాలా దినుసులన్నీ (ధనియాలు, జీలకర్ర, గసగసాలు, గరం మసాలా దినుసులు, ఎండు కొబ్బరి) వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ తాజా మసాలానే కూరకు అసలైన రుచిని ఇస్తుంది. దీనిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి శుభ్రం చేసిన గోంగూర ఆకులు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు వేసి మెత్తగా మగ్గనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి.
కుక్కర్‌లో నూనె వేసి హోల్ స్పైసెస్ (చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు) వేసి వేయించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు మారినేట్ చేసిన మటన్‌ను వేసి 10-15 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత కారం, తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. మటన్ మెత్తగా ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడిని వేసి కలపండి. రెండు నిమిషాల తర్వాత గోంగూర పేస్ట్‌ను కూడా వేసి బాగా కలిపి, నూనె పైకి తేలే వరకు (సుమారు 5 నిమిషాలు) ఉడికించండి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి గోంగూర మటన్ సిద్ధం.
ముఖ్యమైన చిట్కాలు:
* మటన్‌ను నిమ్మరసం, ఉప్పుతో మారినేట్ చేయడం వల్ల ముక్క సాఫ్ట్‌గా మారుతుంది.
* గోంగూరను మరీ మెత్తగా పేస్ట్‌లా చేయకుండా కొంచెం బరకగా ఉంచితే తినేటప్పుడు రుచి బాగుంటుంది.
* ఈ కర్రీ అన్నం, బిర్యానీ, బగారా రైస్ లేదా చపాతీల్లోకి అద్భుతమైన కాంబినేషన్.
ఈసారి మీరు కూడా ఇంట్లో ఈ పద్ధతిలో ట్రై చేయండి, అందరూ ఫిదా అవ్వాల్సిందే.
READ ALSO: Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!