Fish vs Chicken: ఫిష్ vs చికెన్.. ఏది ఎక్కువ ఆరోగ్యకరం? ఏది తినాలి? డాక్టర్ కీలక సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fish vs Chicken: ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ప్రోటీన్ కోసం చేప తినాలా? లేక చికెన్ తినాలా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు, కండరాల బలం పెంచుకోవాలనుకునేవారు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు ఏది ఎంచుకోవాలో ఆలోచిస్తుంటారు. ఈ అంశంపై వైద్య నిపుణులు ఇలా చెబుతున్నారు.. చేప లేదా చికెన్‌లో ఒకటి పూర్తిగా ఉత్తమం అని చెప్పడం సరైంది కాదు. రెండింటికీ ప్రత్యేకమైన పోషక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యక్తిగత ఆరోగ్య అవసరాలు, జీవనశైలి, అలాగే వాటిని ఎలా వండుతున్నారనేదే ఏది ఆరోగ్యకరమో నిర్ణయిస్తుందని తెలిపారు.
చేప ఎందుకు ప్రత్యేకం?
చేపల్లో ముఖ్యంగా సాల్మన్, సార్డిన్స్, మాకరెల్, ట్యూనా వంటి కొవ్వు అధికంగా ఉండే చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శరీరంలో వాపును తగ్గించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.. అంతేకాకుండా చేపల్లో అధిక నాణ్యత గల ప్రోటీన్‌తో పాటు విటమిన్ D, అయోడిన్, విటమిన్ B12 కూడా లభిస్తాయి. సాధారణ ఆహారంలో చాలామందికి ఈ పోషకాలు తగినంతగా అందవని నిపుణులు చెబుతున్నారు. అధ్యయనాల ప్రకారం, ఎర్ర మాంసం లేదా ప్రాసెస్డ్ మాంసానికి బదులుగా చేపలను ఆహారంలో చేర్చడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, అకాల మరణ ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
చికెన్ కూడా ఆరోగ్యకరమే
మరోవైపు చర్మం తొలగించిన చికెన్ బ్రెస్ట్ మంచి లీన్ ప్రోటీన్ వనరుగా పరిగణించబడుతుంది. ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉండటంతో పాటు నయాసిన్, సెలీనియం, ఫాస్ఫరస్, విటమిన్ B6 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కండరాల పెరుగుదల కోరుకునేవారికి, వ్యాయామం తర్వాత కోలుకునేవారికి లేదా అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారికి చికెన్ మంచి ఎంపికగా సూచిస్తున్నారు వైద్యులు.. అలాగే చేపలతో పోలిస్తే చికెన్ తక్కువ ధరలో సులభంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
వంట విధానం కూడా చాలా ముఖ్యం
చేపైనా, చికెనైనా ఎలా వండుతున్నామనేది వాటి పోషక విలువపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. డీప్ ఫ్రై చేసిన చేపలు లేదా ఫ్రైడ్ చికెన్ తింటే అధిక కేలరీలు, సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులు శరీరంలోకి చేరుతాయి. దీంతో వాటి ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి.
ఆరోగ్యకరమైన వంట విధానాలుగా నిపుణులు వీటిని సూచిస్తున్నారు: గ్రిల్లింగ్, బేకింగ్, స్టీమింగ్, రోస్టింగ్, ఎయిర్ ఫ్రైయింగ్..
చివరికి ఏది తినాలి?
డాక్టర్ల ప్రకారం, చేప లేదా చికెన్‌లో ఒకదానిని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. సమతుల ఆహారంలో రెండింటినీ చేర్చుకోవడం ఉత్తమం. వారానికి కనీసం రెండు సార్లు చేపలు, అందులో కనీసం ఒకసారి ఒమేగా-3 అధికంగా ఉండే కొవ్వు చేపలు తీసుకోవాలని సూచిస్తున్నారు.. మిగిలిన రోజుల్లో చికెన్‌ను ప్రోటీన్ వనరుగా తీసుకోవచ్చని చెప్పారు. అయితే సముద్ర ఆహారాలకు అలెర్జీ ఉన్నవారు లేదా మూత్రపిండాల వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో పెద్ద మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
నిపుణుల తుది అభిప్రాయం
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల కారణంగా చేపలు గుండె, మెదడు ఆరోగ్యానికి ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తే, చికెన్ కండరాల ఆరోగ్యానికి, శరీరానికి అవసరమైన లీన్ ప్రోటీన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒకదానిని వదిలి మరొకటి ఎంచుకోవడం కంటే, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం, ఆరోగ్యకరమైన వంట విధానాలు, సరైన పరిమాణంలో ఆహారం తీసుకోవడం, పోషకాలు సమృద్ధిగా ఉండే సమతుల ఆహారాన్ని అనుసరించడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!