Fast Food Side Effects: పళ్ల సమస్యల నుంచి క్యాన్సర్ వరకు.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం.. నిపుణుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fast Food Side Effects: ఫాస్ట్ ఫుడ్ కేవలం కడుపు ఆరోగ్యానికే కాకుండా దంతాలు, నోటి ఆరోగ్యానికి కూడా తీవ్ర హాని కలిగిస్తుందని దంత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, యువతలో బర్గర్లు, పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరగడంతో దంత సమస్యలు కూడా అధికమవుతున్నాయని వైద్యు నిపుణులు చెబుతున్నారు.. ఫాస్ట్ ఫుడ్‌లో ఉండే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు నోటిలోకి చేరిన వెంటనే ఆమ్లాలుగా మారి పళ్లపై ఉండే రక్షణ పొరను దెబ్బతీస్తాయి. అంతేకాకుండా ఫాస్ట్ ఫుడ్లోని కొన్ని భాగాలు పళ్ల మధ్య ఇరుక్కుపోవడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగి దంత క్షయం, చిగుళ్ల వ్యాధులకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
ఫాస్ట్ ఫుడ్‌లో అధికంగా ఉండే సోడియం శరీరంలోని కాల్షియం స్థాయిలను తగ్గించి పళ్లను బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలకు తరచుగా ఫాస్ట్ ఫుడ్ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు కేవలం పళ్లకే పరిమితం కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటిలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియా రక్తప్రవాహం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించి గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో నోటి క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చని తెలిపారు.
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
చిగుళ్ల నుంచి రక్తస్రావం, నిరంతర పంటి నొప్పి, నోటిలో తెల్లటి మచ్చలు, తగ్గని నోటి పుండ్లు, నాలుక రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ప్రతిరోజూ ఫ్లాస్ ఉపయోగించడం, తీపి పదార్థాలను తగ్గించడం, ముఖ్యంగా రాత్రిపూట తినకుండా ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా సమస్య కనిపించిన వెంటనే వైద్య సలహా తీసుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు